తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు. ప్రస్తుతానికి ఏపీపైనే ఫోకస్ చేయడం వల్ల తాను తెలంగాణ ఎన్నికల బరిలో దిగలేదని వైఎస్ జగన్ అంటున్నారు. అటు టీడీపీ నేతలేమో జగన్, కేసీఆర్ కుమ్మక్కు వల్లే వైసీపీ తెలంగాణలో పోటీ చేయలేదని చెబుతున్నారు.

telangana ysrcp కోసం చిత్ర ఫలితం


దీనిపై జగన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. కేసీఆర్‌కు తెలంగాణలో గెలిచేందుకు ఒకరి సపోర్ట్ అవసరం లేదని జగన్ కామెంట్ చేశారు. ఆయన గెలిచాడంటే.. జగన్ సపోర్ట్ వల్ల అనడం కరెక్టు కాదన్నారు. ఒకవేళ ఎవరైనా అలా అంటే అది ఆయన్ను తగ్గించడమే అవుతుందన్నారు జగన్.

telangana ysrcp కోసం చిత్ర ఫలితం


తెలంగాణలో తాము పోటీలో లేముకాబట్టి తమ పార్టీ కార్యకర్తలను మనస్సాక్షి ప్రకారం ఓటేయమని చెప్పామన్నారు జగన్. సాధారణంగా మా పార్టీ వాళ్లు హార్డ్‌ కోర్ కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి తెలుగుదేశానికి ఓటేయడానికి వారికి మనసు రాదన్నారు జగన్అందువల్ల మా వాళ్లు న్యాచురల్‌గా కేసీఆర్ పార్టీకే వేసి ఉంటారని జగన్ వ్యాఖ్యానించారు.

సంబంధిత చిత్రం


అంటే మొత్తం మీద వైసీపీ కారకర్తలు తెలంగాణలో కేసీఆర్‌ కే సపోర్ట్ చేశారన్నమాట. ఈ విషయాన్ని వైఎస్ జగన్ కూడా అంగీకరిస్తున్నారన్నమాట. కాకపోతే.. అదే విషయాన్ని కాస్త అటూ ఇటూ తిప్పి చెప్పేశారు. ఇలా చూస్తే టీడీపీ వాళ్ల ఆరోపణల్లోనూ వాస్తవం ఉన్నట్టే అనిపిస్తోంది. మరి కేసీఆర్‌ తో దోస్తీ జగన్‌కు ముందు ముందు ఎలా లాభిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: