ఏపీలో చంద్రబాబు సర్కారు లక్షల కోట్ల అవినీతి చేస్తోందని ప్రతిపక్షనేత జగన్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అవినీతి చక్రవర్తి పేరిట ఓ పుస్తకం కూడా ప్రచురించింది. ఈ పుస్తకం చెబుతున్నదాన్ని బట్టి చంద్రబాబు అండ్ కో.. దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారట.

jagan vs chandrababu కోసం చిత్ర ఫలితం


చంద్రబాబు అవినీతి ఆధారాలతో సహా ఈ పుస్తకంలో ప్రచురించామని జగన్ చెబుతున్నారు. మరి ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు.. చంద్రబాబును జైలుకు పంపుతారా అన్న ప్రశ్నకు జగన్ కాస్త సుదీర్ఘంగానే సమాధానం ఇచ్చారు. తాను సీఎం అయితే చంద్రబాబు అవినీతిపై యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో వివరించారు.



మేం గెలిస్తే.. డిటైల్డ్ గా ఎంక్వయిరీ చేయిస్తాం.. కేబినెట్ సబ్‌ కమిటీ వేయిస్తాం.. అవసరమైన పక్షంలో ఇంకా ఆధారాలు సేకరిస్తాం.. కోర్టుకు కూడా వెళ్తాం.. నాకూ సీఐడీ ఉంది.. నీకూ సీఐడీ ఉంది అని చంద్రబాబు గతంలో చెప్పారు. మేం ఆ వ్యవస్థలతో పక్కాగా ఆధారాలు సేకరింపజేస్తాం. ఆధారాలు పూర్తిగా వచ్చాక.. తగిన చర్యలు తీసుకుంటాం.. అన్నారు జగన్.

సంబంధిత చిత్రం


ఇంతకీ చంద్రబాబును జైలుకు పంపుతారా లేదా అని సూటిగా అడిగితే.. ఇక ఆయన జైలుకు పోతాడా.. పోడా అన్నది ఆయా కేసుల్లోని ఆధారాలను బట్టి ఉంటుందని జగన్ చెప్పారు. రాజధాని విషయంలో చంద్రబాబు ఇన్‌ సైడర్ ట్రేడింగ్ జరిపారని చెప్పారు. రాజధాని భూముల్లో జరిగిన అవినీతి మామూలుది కాదని.. దీన్ని నిరూపిస్తే చంద్రబాబు జైలుకు పోయే అవకాశం ఉంది అన్నట్టు చెప్పారు జగన్. అయితే జగన్ ఎక్కడా.. మేం కచ్చితంగా చంద్రబాబును జైలుకు పంపుతాం అని చెప్పకపోవడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: