వైసీపీకి ఓ వైపు సినిమా గ్లామర్ బాగా పెరుగుతోంది. దానికి ఉదాహరణగా ఎందరో సినిమా నటులు ఇటీవల కాలంలో ఆ పార్టీలో చేరుతున్నారు. ప్రత్యక్షంగా పొగుడుతున్నారు కూడా. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమన్న మాట కూడా సినీ వర్గాల్లో బలంగా ఉంది. మరి అటువంటి గెలిచే పార్టీకి ఓ ప్రముఖ నిర్మాత షాక్ ఇస్తున్నారా ?


వైసీపీకి గుడ్ బై ?


ప్రముఖ నిర్మాత, సూపర్ స్టార్ క్రిష్ణ సోదరుడు అయిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీని వీడనున్నట్లుగా ప్రచారం సాగుతోంది . ఎంపీ  సీటు విషయంలో వచ్చిన అభిప్రాయభేదాలే ఆయన పార్టీకి దూరంగా జరిగేందుకు కారణమని చెబుతున్నారు. విషయానికి వస్తే ఆదిశేషగిరిరావు గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. అయితే అక్కడ నుంచి విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడికి టికెట్ ఇచ్చేందుకు జగన్ సిధ్ధంగా ఉన్నారు. దాంతో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని జగన్ సూచించారట. దీనికి అంగీకరించని ఆదిశేషగిరిరావు వైసీపీని వీడేందుకే నిర్ణయించుకున్నారని అంటున్నారు. రేపో మాపో తన రాజీనామాను అధినేత జగన్ కి పంపుతారని తెలుస్తోంది.


ప్రభావం ఉంటుందా :


ఆదిశేషగిరిరావు పార్టీని వీడితే ప్రభావం ఉంటుందా అన్న దానిపైన చర్చ సాగుతంది. అయితే ఆయనకు టికెట్ నిరాకరించి వేరొకరికి ఇచ్చీంది కూడా అదే కమ్మ సామజిక వర్గం అయినపుడు పార్టీ మీద ప్రభావం ఏముంటుందని అన్న మాట వినిపిస్తోంది. ఇక క్రిష్ణ సోదరుడిగా ఆదిశెషగిరిరావు ఉంటున్నా పార్టీకి క్రిష్ణ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ సానుభూతిపరులుగా ఉన్నారా అంటే అది పెద్ద ప్రశ్నే ఎందుచేతనంటే
మహేష్ బావ గల్లా జయదేవ్ గుంటూరు టీడీపీ  ఎంపీ. ఆ విధంగా మహేష్ ఫ్యాన్స్ సహజంగానే ఉంటే టీడీపీకి సపోర్ట్ గా ఉంటారు. ఒక వేళ రాజకీయలకు సంబంధం లేదనుకునే వారు అన్ని పార్టీలకూ ఓటు వేస్తారు. అందువల్ల ఆయన ప్రభావం సినిమా పరంగా ఉండేది లేదన్నది వైసీపీ వర్గాల మాటగా ఉంది. ఏది ఏమైనా సీనియర్ నాయకుడొకరు ఎన్నికల ముందు పార్టీని వీడాలనుకోవడం కొంత ఇబ్బందికరమైన వ్యవహారమేనని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: