స్వతంత్రంగా వ్యవహరించవలసిన వ్యవస్థల విధినిర్వహణలో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఆవ్యస్థల పనితీరును నీరుగార్చేస్తుందని మరోసారి సుప్రీం కోర్ట్ తన తీర్పులో స్పష్టంగా చెప్పింది. సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్‌ వర్మను సెలవుపై కేంద్రం పంపడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఆలోక్ వర్మను తిరిగి వెంటనే సీబీఐ డైరెక్టర్‌గా నియమించాలని ఆదేశించింది. ఆలోక్ వర్మపై కేంద్ర నిర్ణయాన్ని సెలెక్ట్ ప్యానెల్‌ కు పంపాలన్న సుప్రీంకోర్టు, అప్పటి వరకూ ఆయన కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోరాదని స్పష్టం చేసింది.

CBI Vs CBI case supream judgement కోసం చిత్ర ఫలితం
ఈ కేసులో కేంద్రం, సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్‌ వర్మను గతేడాది అక్టోబర్ 23 న రాత్రికి రాత్రి తప్పించి ఆ స్థానంలో కె. నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. వర్మతో పాటూ, ఆయనకు మద్దతుగా నిలుస్తున్న మరో 13 మందిని బదిలీ చేసింది. ఐతే ఈ చర్య అప్పట్లో పెనుదుమారం రేపింది. స్వతంత్రంగా వ్యవహరించే సీబీఐని కేంద్రం తన చెప్పు చేతల్లో పెట్టుకుంటోందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.

కేంద్ర ప్రభుత్వం తనను బాధ్యతల నుంచి తప్పించి, బలవంతంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఆలోక్‌ వర్మ అక్రమాలకు పాల్పడ్డారనీ, కీలక కేసుల దర్యాప్తు ముందుకు సాగనివ్వట్లేదని సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా ఆరోపించారు. రాకేశ్ ఆస్తానా అవినీతికి పాల్పడ్డారనీ, తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆలోక్‌వర్మ ఆరోపిస్తున్నారు.

CBI Vs CBI case supream judgement కోసం చిత్ర ఫలితం
ఈ పరిస్థితుల మధ్య సీవీసీ సిఫార్సుతో ఆలోక్‌ వర్మను కేంద్రం సెలవు పై పంపింది. జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న కే నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టు మెట్లెక్కారు.

 

ఆలోక్ వర్మ, కేంద్రం, సీవీసీ వాదనలు విన్న సుప్రీంకోర్టు డిసెంబర్ 6న తీర్పును రిజర్వ్ చేసింది. ఆ సందర్భంగా, ఆలోక్ వర్మ, రాకేశ్ ఆస్తానా, పిల్లి, ఎలుకలా ఫైట్ చేసుకుంటున్నారని సుప్రీంకోర్టు చేసిన కామెంట్ సెన్సేషన్ అయ్యింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సెన్సేషనల్ అయ్యింది.

CBI Vs CBI case supream judgement కోసం చిత్ర ఫలితం 

జనవరి 31తో ఆలోక్ వర్మ రెండేళ్ల పదవీ కాల పరిమితి ముగుస్తుంది. దాంతో సంబంధం లేకుండా  ఆయన్ని పదవి నుంచీ కేంద్రం తాత్కాలికంగా తప్పించడం తప్పేమీ కాదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. ఈ వాదనతో సుప్రీంకోర్టు విభేదించింది. సుప్రీంకోర్టు తీర్పు లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రానికి చెంపపెట్టులాంటిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే కేంద్ర వ్యవస్థల్ని భ్రష్టుపట్టిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు షాకిచ్చినట్లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: