కొన్ని రోజుల నుంచి బాలక్రిష్ణ మీద నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాము. రోజుకొక సిరీస్ చొప్పున బాలయ్య మీద వీడియో లను పోస్ట్ చేస్తున్నాడు. అయితే మరో వైపు బాలకృష్ణ తన ‘ఎన్టీఆర్’ చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. నిన్న బెంగళూరు వెళ్లిన బాలకృష్ణ నేడు చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు. తిరుపతిలో ఒక విలేకరి బాలకృష్ణ ను నాగబాబు వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరాడు. పలువురు నాగబాబు వ్యాఖ్యలపై స్పందన ఏంటీ అంటూ బాలకృష్ణ ను ప్రశ్నించారు.

Image result for balakrishna nagababu

నాగబాబు వ్యాఖ్యలపై నో కామెంట్ అంటూ బాలకృష్ణ చాలా లైట్ గా బదులిచ్చాడు. ప్రస్తుతం బాలకృష్ణ దృష్టి అంతా కూడా ‘ఎన్టీఆర్’ చిత్రం పైనే ఉంది. కనుక ఇప్పుడు ఆ విషయంపై బాలకృష్ణ స్పందించక పోయి ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలకృష్ణ స్పందించక పోవడమే మంచిదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో పీజేఆర్ మూవీ ల్యాండ్స్ లో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సందడి చేసిన బాలకృష్ణ సినిమా గురించి పలు విషయాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు.

Image result for balakrishna nagababu

సీఎంగా ఎన్టీఆర్ మొదటి సారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు జనవరి 9 - ఆ తేదీనే మా సినిమాను విడుదల చేస్తున్నాం. ఇది యాదృచ్చికంగా జరుగుతుంది. నాన్నగారి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను - ఆయన బయోపిక్ తీసి కొంతైనా ఆయన రుణం తీర్చుకుంటున్నాను. బసవతారకం హాస్పిటల్ స్థాపించి అమ్మ రుణం కొంత మేరకు తీర్చుకున్నాను. ఇప్పుడు నాన్న రుణం తీర్చుకునేందుకు ఈ సినిమా చేశానంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. అమ్మ పాత్రలో విద్యాబాలన్ అద్బుతంగా చేసింది - ఆమె ఈ పాత్రకు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. కుమారుడు తండ్రి పాత్రను పోషించడం ప్రపంచంలోనే రికార్డు. ఆ అరుదైన అవకాశం నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుడినన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: