వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రం ముఖచిత్రాన్ని మార్చేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రజా సంకల్ప పాదయాత్ర నుండి వైసీపీ పార్టీ పరిస్థితి ఒకసారి గమనిస్తే నంద్యాల ఎన్నికల లో జరిగిన ఉప ఎన్నికలలో చాలా మెజార్టీతో టీడీపీ పై ఓడిపోయింది. ఈ క్రమంలో ఎక్కడా కూడా పార్టీకి డౌన్ ఫాల్ రాకుండా వెంటనే జగన్ పాదయాత్ర ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఆంధ్రాలో రాజకీయాలు మొత్తం తలకిందులుగా మారిపోయాయి.

Image may contain: 2 people

ముఖ్యంగా జగన్ పాదయాత్రకు ముందు కలిసి ఉన్న టిడిపి బిజెపి జనసేన పార్టీలు పాదయాత్ర సగంలోనే మూడుగా చీలి పోవడం జగన్ సాధించిన మొదటి విజయం అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో పాదయాత్రలో జగన్ వివిధ వర్గాల ప్రజలను మరియు సామాజిక ప్రజలను కలుసుకుని వారికి ధైర్యాన్నిస్తూ ముందుకు పోవడం నిజంగా వైయస్సార్ ని మరోసారి జగన్ గుర్తు చేశారు అని చాలామంది ప్రజలు అంటున్నారు.

Image may contain: 5 people, people smiling, outdoor

ప్రజలను ఆదుకోవడంలో వారిని ఓదార్చడం లో వైయస్ కుటుంబానికి మించిన వారు మరొకరు లేరని అంతగా వారు ప్రజలతో కలిసిపోతారని చాలామంది జగన్తో పాదయాత్రలో పాల్గొన్న ప్రజలు అంటున్నారు.

Image may contain: 30 people, people smiling, crowd and outdoor

నిజంగా తన కుటుంబాన్ని విడిచి మా కోసం మా బిడ్డల భవిష్యత్తు కోసం జగన్ ఇంతగా కష్టపడడం ఇటువంటి రాజకీయ నాయకుడు కలిగిన ఈ రాష్ట్రం కచ్చితంగా భవిష్యత్తులో దేశంలో అత్యున్నత స్థాయిలో ఉంటుందని పార్లమెంట్ చీకటి గదిలో అన్యాయంగా ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిన నాయకులు త్వరలోనే జగన్ నాయకత్వంలో జరగబోయే అభివృద్ధి గురించి పార్లమెంటులో కథలు కథలు గా చెప్పుకునే రోజులు వస్తాయని అంటున్నారు ఏపీ ప్రజలు. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర తో ప్రజల మన్నలను అందుకున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు .



మరింత సమాచారం తెలుసుకోండి: