సంక్రాంతి అంటేనే సంబరం.. మరి ఆ సందడంతా ఎక్కడి నుంచి వస్తుంది.. పొలాలు పండి.. ఇంటికి చేరిన ధాన్యరాశులతోనూ.. ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లతోనూ.. కొత్త బట్టలతోనూ.. పిండివంటలతోనూ.. వస్తుంది. అంతవరకూ ఓకే..కానీ అంతేనా.. వీటితోనే పండుగ కళ వస్తుందా..

Related image


ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకోండి.. సంక్రాంతి వస్తుందనగానే కొన్నిరోజుల ముందునుంటే గ్రామాల్లో మెడలో దండ, చేతిలో చిడతలు, తంబూరాతో ‘హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి’ అంటూ హరిదాసులు సందడి చేసేవారు కాదా.. రంగురంగుల పట్టు వస్త్రాలతో కాళ్ల నుంచి కొమ్ముల వరకూ బసవన్నలను అందంగా ఆలంకరించుకుని.. అయ్యవారికీ దండం పెట్టూ అంటూ గంగిరెద్దులవారు చేసే సందడి ఏమైనా తక్కువా..?

Related image


అంతేనా.. డమరుకం వాయిస్తూ.. అంబ పలుకు జగదంబ పలుకు అంటూ ఇంటింటి భవిష్యవాణిని వినిపించే బుడబుక్కల స్వాములు ఎటు చూసినా కనిపించేవారే.. వీళ్లేనా.. పగడి వేషగాళ్లు, కొమ్మదాసరిలు, పిచ్చికుంట్లవారు, జంగం దేవరలూ, పిట్టల దొరలు.. ఎన్నిరకాల వారు సందడి చేసేవారు.

Related image


మరి ఇప్పుడు ఆ సందడి అంతా ఏమైంది. వారంతా కనిపిస్తున్నారా.. లేదు. అందరూ కాకపోయినా వీరిలో ఒకరో ఇద్దరూ అడపాదడపా కనిపిస్తున్నారంతే. మారుతున్న కాలంతో కుల వృత్తులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో సంస్కృతీసంప్రదాయాలకూ గడ్డుకాలమే వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: