దాదాపు ఏడాదిపాటు సుదీర్ఘ సమయం పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌ ఇవాళ తన యాత్రను ముగించబోతున్నారు. కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభించిన ఈ మహా పాదయాత్ర ఇచ్చాపురం జిల్లాలో ముగియనుంది.



ఇలాంటి సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్రకు గుర్తుగా బహుదానదీ తీరంలో అద్భుతమైన విజయ సంకల్పస్థూపం పేరుతో పైలాన్ రూపొందించారుజగన్‌ ఆవిష్కరించనున్న ఈ పైలాన్‌ కు అనేక ప్రత్యేకతలున్నాయి.


91అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన ఈ పైలాన్‌ ఎత్తు 91 అడుగులు. చూసేందుకు ఈఫిల్ టవర్‌ తరహాలో ఈ పైలాన్ కనిపిస్తుంది. ఈ పైలాన్‌ దిగువన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, వైఎస్‌ జగన్ చిత్రాలు ఉంటాయి. బేస్‌ మెంట్‌ పైకి వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గుర్తుగా 13 మెట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో మెట్టుపై ఒక్కో జిల్లా పేరు రాశారు.



ఈ పైలాన్ పైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చిహ్నంగా పార్లమెంట్ రూపంలో డోమ్‌ ఏర్పాటు చేశారు. దీనిపైన పది అడుగుల ఎత్తులో పార్టీ పతాకాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రత్యేకతలతో ఈ పైలాన్ అత్యద్భుతంగా, ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. ఇచ్ఛాపురం బైపాస్‌ వద్ద బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన ఈ స్థూపం శాశ్వతంగా టూరిస్టు ప్లేసులా ఉండేలా తీర్చిదిద్దారు.

పైలాన్‌ లోపలి భాగంలో చుట్టూ జగన్‌ తన పాదయాత్రలో ప్రజలను కలుసుకుంటూ వచ్చిన ఫొటోలను ఉంచారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దాకా జగన్‌ నడిచిన రూట్‌ మ్యాపును కూడా ఉంచారు. దిగువున చుట్టూ ఒక చిన్న పచ్చికబయలును ఏర్పాటు చేశారు. బయట చుట్టూ ప్రహరీ గోడపై ఓ వైపు ప్రజాసంకల్ప పాదయాత్ర వివరాలు రూపొందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: