జీవించు.. జీవించనివ్వు.. నవ్వు.. నవ్వించు.. ఇవన్నీ మన సంస్కృతిలో భాగమే. అందుకే పండుగలు, పబ్బాలప్పుడు చేతనైనంత వరకూ దానం చేయమని చెబుతుంటారు. సంక్రాంతి వేళ కూడా అలాంటి దానాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Image result for makar sankranti paintings


నువ్వులను దానం చేస్తే శని దోషం తొలగిపోతుంది. ఈ దానం ద్వారా మనస్తాపాలు తొలిగిపోయి ఆరోగ్యం కలుగుతుంది. ఈ దానం ద్వారా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. నువ్వులను దానం చేస్తే శరీరంలోని మాంసదోషం కూడా తొలగుతుంది.

Image result for makar sankranti pooja


మరో దానం బెల్లం. దీన్ని దానం చేస్తే సంతానం కలుగుతుంది. వంశం వృద్ధి చెందుతుంది. ఈ ఫలితాలు ఇచ్చిన వారికే కాదు. దానం పొందిన వారికి కూడా ఫలితమిస్తాయి. ఈ దానాలు చేస్తూ శక్తి కొలది మిగిలిన దానాలు కూడా చేయవచ్చు.

Image result for makar sankranti pooja


సంక్రాంతి వేళ పై దానాలు చేస్తూ పితృ దేవతలకు నైవేద్యం పెట్టాలి. సంక్రాంతి వేళనే శ్రీహరి భూమిని సముద్రం నుంచి పైకి తీసుకువచ్చాడు. దాన్ని గుర్తు చేయడానికి.. అలాగే భూదానం ఫలితాన్నిపొందడానికి కూడా నువ్వులు, బెల్లం దానం ఇవ్వాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: