సుదీర్ఘ పాదయాత్ర తర్వాత వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డిలో ఇప్పుడు పరిణితి చెందిన రాజకీయ నాయుకుడు కనిపిస్తున్నాడు. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఒక రాయలసీమ రెడ్డి లక్షణాన్ని వదిలేసుకున్నప్పుడే ముఖ్యమంత్రి అయ్యాడని చరిత్ర గుర్తు చేస్తోంది. ఐదేళ్ల పాలనకే ప్రజలమనిషిగా ముద్రపడ్డాడని కూడా గమనించాలి. జగన్ కూడా అలా కాకపోతే ఇలా ఈరోజు నిలబడేవాడు కాదు.

Image result for ys jagan padayatra hd pics

నిజానికి జగన్ తండ్రి చనిపోయినప్పుడు, సంపద, పేరు, హోదా అన్నీ వున్నాయి. కాంగ్రెస్ అధిష్టానంతో కాస్త కాంప్రమైజ్ అయివుంటే చనిపోయేదాకా కనీసం అదేస్థాయిలో ఎంజాయ్ చేస్తూ చనిపోవచ్చు. కలిసొస్తే, తండ్రిలాగా సొంత పార్టీతో పోరాడుతూ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ విరుద్ద పంధా ఎన్నుకోవడంలోనే విషయమంతా !

Related image

ఎటువైపునా మద్దతులేకపోవడంకాదు, అన్నివైపులా శత్రువుల మధ్య ఎదగడం అద్వితీయం. ఒక పత్రిక, టీవీ లేకపోతే ఒక సర్పంచు స్థాయికన్నా ఎక్కువ ఈ ప్రపంచం చూపేది కాదేమోగానీ.. అవే అతన్ని ఈ స్థాయికి తెచ్చాయంటే మాత్రం అబద్దం. ఎదుటి పక్షం దేని విషయంలో తనని తప్పుపడుతోందో దానికి విరుద్దమైన వ్యక్తిత్వాన్ని చూపడంలో జగన్‌ కృతకృత్యుడయ్యాడనాలి.

Related image

పుట్టుకతోనే తనమీద పడిన భావజాలపు ఉక్కుపొరని జగన్‌ సమర్థవంతంగా చీల్చుకుని బయటికి వచ్చాడనాలి. ఇగొ, గర్వం, మొండితనం, ద్వేషం, సోకాల్డ్ ఫ్యాక్షనిస్టు మనస్తత్వం లాంటి వాటిని తన అడుగడుగు ప్రవర్తనతో బదాబదలు చేశాడు. ఎవరినైనా అన్నా, అమ్మా అనే పలకరింపు, అన్నిటికన్నా నేలమీది ప్రవర్తనతో ఇన్ని కేసులు, జైలుజీవితం, ఆరోపణలు, ప్రచారాలు, ప్రలోభాల నడుమ, అటుకేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థుల నడుస్తూ గమ్యంవైపు స్థిరంగా ముందుకుపోవడం ఆయన్నువిజయం వైపు నడిపిస్తున్నాయని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: