అమెరికాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అమెరికన్ ప్రభుత్వం పాక్షికంగా పనిచేయడం మానేసి 20రోజులు కావస్తోంది. ఆ దేశంలో కొన్ని వేల మందికి జీతాలు రావడం లేదుమెక్సికోతో వున్న దక్షిణాది సరిహద్దుకు గోడ కట్టే విషయంలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌నకూ.. ప్రతినిధుల సభకూ ఉన్న విబేధాల కారణంగా అగ్రరాజ్యానికి ఈ దుస్థితి తలెత్తింది.

Image result for trump mexico wall


సరిహద్దు గోడ కట్టాల్సిందే అంటాడు ట్రంపు.. ససేమిరా అందుకు ఒప్పుకోమంటోంది డెమోక్రాట్ల మెజారిటీ వున్న ప్రతినిథుల సభ. ఎమర్జెన్సీ ప్రకటించైనా గోడ కట్టే తీరతానని అధ్యక్ష్యడు ఘీంకరిస్తే, నిన్ను అభిశంసిస్తామంటూ ప్రతినిథుల సభ ఘాటుగా జవాబిస్తోంది. ఈ రెండు ఏనుగుల మధ్య జీతానికీ జీతానికి మధ్య రోజుల్ని నెట్టుకొచ్చే బడుగు జీవులూ, ప్రభుత్వ సాయంతో ఆహారం కొనుక్కునే పేదవారూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Related image


అయితే ఈ గోల అంతా మనకెందుకు అంటారా.. అటు ట్రంపు, ఇటు ప్రతినిధుల సభా ఇలాగే పట్టువిడవకుండా ఉంటే.. నెలో, రెండు నెలలో ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం ప్రాజెక్టులపై ఆధారపడే ఇండియన్ సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్ల పరిస్థితి కూడా దారుణంగా తయారవుతుంది. మన వాళ్లకూ జీతాలు అందవు.

Related image


ఇండియా నుంచి.. అందులోనూ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన సాప్ట్ వేర్ ఇంజినీర్లతో పాటు ఇతర ఎన్నారైలకూ నిద్ర కరువవుతుంది. అమెరికాలో వర్షం పడితే హైదరాబాదులో గొడుగు పట్టే ఒక్క తెలుగు పత్రిక కూడా ఈ విషయంపై అంతగా దృష్టి సారించడం లేదు. దీనికి సంబంధించిన వార్తలు కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: