తెలుగుదేశంపార్టీ అనుకున్నంతా అయ్యింది. అందుకే చంద్రబాబునాయుడు అండ్ కో లో టెన్షన్ పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును విచారణ నిమ్మితం ఎన్ఐఏకి హ్యాండోవర్ చేయాలని కోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. జగన్ హత్యాయత్నం కేసును విచారించేందుకు ఎన్ఐఏ జనవరి 3వ తేదీన రంగంలోకి దిగినా స్ధానిక పోలీసులు ఏమాత్రం సహకరించన విషయం అందరికీ తెలిసిందే. లోకల్ పోలీసుల వైఖరితో మండిపోయిన ఎన్ఐఏ ఉన్నతాధికారులు చివరకు విజయవాడలో కోర్టును ఆశ్రయించారు. ఎన్ఐఏ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు పోలీసులకు బాగా తలంటింది.

 

హై కోర్టు ఆదేశాలతో విచారణకు రంగంలోకి దిగిన ఎన్ఐఏకు స్ధానిక పోలీసులు సహకరించకపోవటంపై ఆశ్చర్యపోయింది. విషయమంతా పూర్తిగా అర్దం చేసుకున్న కోర్టు చివరకు పోలీసులకు చివాట్లు పెట్టిందట. హత్యాయత్నం కేసులో ఎన్ఐఏకి సహకరించాలని, అదే విధంగా నిందితుడు శ్రీనివాస్ ను వెంటనే ఎన్ఐఏకి హ్యాండోవర్ చేయించాలంటూ గురువారం రాత్రి ఆదేశించింది. దాంతో ఈరోజు నిందితుడిని ఎన్ఐఏ విచారణ నిమ్మితం తన పరిధిలోకి తీసుకోనున్నది.

 

హత్యాయత్నం కేసులో మొదటి నుండి చంద్రబాబు అండ్ కో ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నారో చివరకు అదే జరిగింది. విశాఖపట్నం విమానాశ్రయంలో మొన్నటి అక్టోబర్ 25వ తేదీన జగన్ పై కత్తితో శ్రీనివాస్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే శ్రీనివాస్ తో దాడి చేయించేయించిందెవరు అన్న విషయయే సస్పెన్సుగా మిగిలిపోయింది. హత్యాయత్నానికి సూత్రదారి చంద్రబాబే అని వైసిపి నేతలు అంటున్నా అవి కేవలం ఆరోపణలు మాత్రమే ఇప్పటి వరకు. అదే ఎన్ఐఏ విచారణలో తేలిపోతే అప్పుడుంటుంది చంద్రబాబు అండ్ కో కు అసలైన సినిమా.


మరింత సమాచారం తెలుసుకోండి: