పద్నాలుగు నెలల పాటు అవిరామంగా జగన్ చేసిన పాదయాత్ర ఇపుడు ఏపీలో సరికొత్త బెంచ్ మార్కు ని క్రియేట్ చేసింది. అంతే కాదు, రాష్ట్ర రాజకీయాలలో సైతం చర్చగా మారింది. జగన్ పాదయాత్ర పూర్తి కావడంతో  తో వీసీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. అదే సమయంలో అధికార టీడీపీ సహా, విపక్షాలు దీనిపైన తమదైన తీరులో స్పందిస్తున్నాయి.


జగన్ పై విరుచుకుపడ్డారు :


జగన్ పాదయాత్ర ఇలా పూర్తి అయిందో లేదో మంత్రులంతా కలసి ఒక్కసారి విరుచుకుపడ్డారు. జగన్ ది పాదయాత్ర కాదు  ఆ పార్టీకి ముగింపు యాత్రని ఓ మంత్రి అంటే, జగన్ పాదయాత్రకు జనమే లేరని మరో మంత్రి అన్నారు జగన్ ఏం సాధించడానికి పాదయాత్ర చేశారని మరో మంత్రి నిలదీస్తే, అసలు పాదయాత్ర చేసే హక్కు ఆయనకు లేదని ఇంకోకాయన అంటారు. ఇక జగన్ ఎన్ని అడుగులు నడిచారు, ఎన్ని శెలవులు పెట్టారన్నది మరో ఆయన తనదైన తప్పుడు లెక్కల చిట్టాను బయటకు తీస్తాడు.


 వీరికి కొత్తగా జత అయిన కాంగ్రెస్ భజన బ్రుందంలోని మరో పెద్ద మనిషి దే సందర్భంలో జగన్ అవినీతిని తెర పైకి తెస్తాడు, పాచిపోయిన లడ్డూల్లాంటి పాత విమర్శలనే మళ్ళీ చేసి జగన్ కంటే అవినీతి పరుడు వేరొకరు లేరంటారు. మొత్తానికి మొత్తం వీరంతా జగన్ పాదయాత్ర గురించే మాట్లాడుతూంటేనే అర్ధమైపోవడం లేదు, జగన్ పాదయాత్ర సూపర్ హిట్ అయిందని, జగన్ తాను అనుకున్నట్లుగా పాదయాత్ర పూర్తి చేసుకున్నారు, మిగిలిన కార్యాచరణకు పదును పెడుతున్నారు. కానీ ఈ నేతాశ్రీలు మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయారంటే ఆ ప్రభావం బాగానే ఉన్నట్లు అర్ధమవుతోంది కదా..


ఆయన చెప్పేశారుగా :


ఇక రాజకీయాల్లో న్యూట్రల్  గా ఉంటానని అంటున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం జగన్ పాదయాత్ర సూపెర్ హిట్ అని చెప్పేశారు. ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్, చంద్రబాబు ల కంటే కూడా జగన్ పాదయాత్ర బాగా జరిగిందని, ఎక్కడ చూసినా జగన్ కి జనం పోటెత్తారని, అన్నీ అనుకూలిస్తే వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని కూడా ఆయన జోస్యం చెప్పేశారు. జగన్ పట్టుదలకు నిదర్శనం ఈ పాదయాత్ర అని కూడా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: