ఈ అనంత విశ్వంలో ఈ భూమి పరిమాణం ఓ అణువంత. భూమి, చంద్రుడు.. ఇతర గ్రహాలు ఉండే సౌరకుటుంబం కూడా ఆకాశంలో కనిపించే ఓ చుక్క.. దాన్ని చుట్టూ ఉండే కాస్త భాగం మాత్రమే.. మరి విశాల ఆకాశంలో ఎన్నినక్షత్రాలో.. ఎన్ని సౌరమండలాలో.. ఇలా ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది.

Image result for the universe


ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందామని మనం చెప్పుకుంటున్నా.. మనం తెలుసుకోగలిగింది ఒక్క సౌర మండలం గురించి మాత్రమే. మరి ఈ విశాల విశ్వంలో మన భూమిలాంటివి ఎక్కడా లేవా.. ఉంటే వాటిపై మనలాంటి మనుషులు లేరా.. మనుషులు కాకపోయినా ఇతర జీవరాశి లేదా.. ఇవన్నీ శతాబ్దాలుగా మనిషి మెదడును తొలుస్తున్న ప్రశ్నలే.

Image result for ALIEN


కానీ ఇప్పటి వరకూ విశ్వంలో భూమిపై  తప్ప ఎక్కడా ఇతర జీవరాశి ఉన్నట్టు సాక్ష్యాలు లభించలేదు. ఏలియన్స్ ఉన్నారని.. ఫ్లయింగ్ సాసర్స్ వచ్చాయని వార్తలు ఉన్నా.. వాటికి సరైన ఆధారాలు లభించలేదు. కానీ మొట్టమొదటిసారి ఓ సాక్ష్యం లభిస్తోంది. అది విశ్వంలో మనల్ని మించిన మేథావులైన జీవరాశి ఉన్నట్టు అనుమానం కలిగేలా చేస్తోంది.

repeatingfrb

అదేమిటంటే.. ఫాస్ట్‌ రేడియో బరస్ట్‌.. తెలుగులో చెప్పాలంటే శీఘ్ర రేడియో తరంగ విస్ఫోటనం.. మనకు 150 కోట్ల క్రాంతి సంవత్సరాల దూరంలో మెరుపులా మెరిసిన ఈ ఫాస్ట్ రేడియో బరస్ట్.. ఎఫ్‌ ఆర్‌ బీ.. ఇప్పుడు సైంటిస్టులకు నిద్ర లేకుండా చేస్తోంది. అందులోనూ ఈ ఎఫ్‌ఆర్బీలు పదే పదే ఒకే చోటు నుంచి రావడం చూస్తే ఇది గ్రహాంతరవాసుల పనేనేమో అన్న అనుమానం కలుగుతోంది. దీనిపై ఇప్పుడు పరిశోధనలు తీవ్రం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: