తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చారు.  కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని అమరావతి నిర్మాణం కోసం అహర్శిశలూ కష్టపతున్నారు. మరోవైపు ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పోలవరం పూర్తి కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  అయితే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ బిజీ షెడ్యూల్ తో గడుపుతుంటారు. విదేశీ పర్యటనలు, సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులు, మంత్రులు కాన్ఫిరెన్స్ ఏర్పాటు  చేయడం..ప్రతిపక్ష పార్టీలకు సరైన సమాధానాలు చెప్పడం..ఇలా ఎప్పుడు బిజీగా గడిపే చంద్రబాబు నాయడు గురువారం చిన్నపిల్లాడైపోయారు.  ఎప్పుడు సీరియస్ గా ఉండే చంద్రబాబు చిన్న పిల్లవాడు కావడం ఏంటా అని అనుమానం వస్తుంది..కానీ ఇది నిజం. 

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టులకు శంకుస్థాపన చేసి పైలాన్లను ఆవిష్కరించారు. ప్రస్తుతం సంక్రాంతి సెలవు కావడంతో చిన్న పిల్లలు అక్కడ ఆటలు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో పిల్లలను చూసిన సీఎం ఆగలేకపోయారు. చిన్నపిల్లాడిలా వారితో కలిసి గోళీలాడారు.
Image result for cm chandrababu naidu play marbles
అలాగే, కర్రాబిళ్ళా, వాలీబాల్, కోలాటం ఆడుతూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. సంక్రాంతి సెలవుల్లో తన చిన్నతనంలో ఆట పాటలతో ఎంతో సంతోషంగా గడిపేవాళ్లం అని..ఇన్నాళ్లకు తన సంతోషాన్ని మరోసారి పంచుకున్నానని అన్నారు చంద్రబాబు. అనంతరం జన్మభూమి, మావూరు సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు, పిల్లల ఆటల పోటీలను  సందర్శించారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: