Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 3:32 pm IST

Menu &Sections

Search

జగన్ , పవన్ కలిస్తే ప్రభంజనమే ... !

జగన్ , పవన్ కలిస్తే ప్రభంజనమే ... !
జగన్ , పవన్ కలిస్తే ప్రభంజనమే ... !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఉండవల్లి అరుణ కుమార్ రాజకీయాల్లో మేధావి గా పేరు తెచ్చుకున్నాడు. చెప్పాల్సిన విషయాన్ని కుండ బద్దలు కొట్టి నట్లు చెబుతాడు. ఎవరి మీద స్వంత ప్రేమ చూపడు. అయితే ఉండవల్లి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ అడుగు పెట్టక పోయినప్పటికీ మీడియా తో ముచ్చటిస్తుంటాడు. గురువారం నాడు ఓ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఈ విషయాలు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని అయితే నారా చంద్రబాబు నాయుడు చివరి వరకూ తన పట్టును వదలరని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

undavalli-arun-kumar-jagan-chandra-babu-pavan

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సూపర్ హిట్ అయ్యిందని ఉండవల్లి ప్రశంసించారు. " గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి నారా చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్రల కంటే జగన్ పాదయాత్ర చాలా హిట్ అయ్యింది. ఈ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు " అని ఉండవల్లి విశ్లేషించారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ మక్తాయింపు ఇచ్చారు.జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఇప్పుడే ముఖ్యమంత్రి అయిపోవాలని లేదని మరో 15 సంవత్సరాలు వరకూ ఆయన వేచి చూస్తానని ఆయన తనతో అన్నారని ఉండవల్లి చెప్పారు.

undavalli-arun-kumar-jagan-chandra-babu-pavan

రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ కలిస్తే నష్టపోయేది పవన్ కల్యాణ్ మాత్రమేనని ఉండవల్లి అన్నారు. " గత ఎన్నికల్లో వీరిద్దరు కలిస్తేనే కేవలం నాలుగు ఐదు లక్షల ఓట్ల తేడాతోనే జగన్ ఓడిపోయారు. ఇప్పుడు వారిద్దరు కలిసినా జగన్ కు పెద్దగా నష్టం ఉండదు" అని ఉండవల్లి అన్నారు. అయితే పవన్ కల్యాణ్ జగన్ కలిస్తే మాత్రం రాష్ట్రంలో ప్రభంజనమే అని ఉండవల్లి అన్నారు. " జగన్మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిస్తే అద్భుతమే. అయితే వారిద్దరు కలిసే అవకాశాలు చాలా తక్కువ" అని ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు. 

undavalli-arun-kumar-jagan-chandra-babu-pavan
5/ 5 - (1 votes)
Add To Favourite