సంక్రాంతి వచ్చిందంటే పల్లెల్లో గంగిరెద్దుల హడావిడి అంతా ఇంతా కాదు.. చక్కటి సన్నాయి రాగాలు పలికిస్తూ గంగిరెద్దులవారు పండుగ సందడిని గుర్తుకు తెస్తారు. అయితే ఈ గంగిరెద్దులు ఎందుకు సంక్రాంతి వేళ తీసుకువస్తారు. దీని వెనుక ఏం పరమార్థం ఉంది.. తెలుసుకుందాం..

Related image


బలిష్టమైన ఎద్దులనే గంగిరెద్దులుగా వాడతారు. గంగిరెద్దు ఎంత బలిష్టంగా ఉంటుందో అంతా పనిచేస్తుంది. సోమరిగా ఏమాత్రం ఉండదు.ఎద్దు శివుని వాహనం. పూర్తి ధర్మస్వరూపం. అందుకే దాని మూపురం శివుని లింగాకృతి రూపంలో ఉంటుంది. అందుకే దానికి శివభావనతో పూజలు చేస్తారు. గంగిరెద్దుకు అటూ ఇటూ ఉండే ఇద్దరు నందికి ఇరువైపులా ఉండే మార్దంగికులు అన్నమాట.

Related image


తొలికరి చినుకు పడిన నాటి నుంచి పంట ఇంటికి వచ్చేవరకూ రైతుకు అండగా శ్రమించే ఎద్దు.. సంక్రాంతి వేళ తానే స్వయంగా భిక్షకు వస్తుంది. అంటే.. మీకు ఇంత కష్టపడి ధాన్యం పండించింది నేనే అనే అహంకారం ఏమాత్రం ఉండదు.

Related image


అందుకే అణుకువగా ఉండాలని గంగిరెద్దు చెబుతుంది. ముందూ వెనుకా వచ్చే నాదస్వరం వాయించేవారు.. రోజూ ఉదయాన కంఠాన్నిమంద్ర ధ్వనితో పలికించుకుంటూ గొంతును కాపాడుకోవాలని చెప్పేందుకు ఓ సంకేతం అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: