జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కులాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో కులం గొడవలు ఉన్నాయని దాన్ని మనం అంగీకరించి తీరాలని ఆయన గుంటూరులో నిర్వహించిన ఓ సభలో అన్నారు. ఏపీ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువ అన్న అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం..

Image result for PAWAN KALYAN SPEECH


"మన సమాజంలో కులం సమస్య అనేది ఉంది. కులాల గొడవలున్న సమాజం మనది. మనిషి తాలూకూ భావనలు ఉంటాయి. దాన్ని మనం అంగీకరించాలి. ఆఫ్రికా దేశాల్లో జాతుల సమస్య ఉంది. మన దగ్గర కులం ఉంది. దీన్ని అంగీకరిస్తూనే బాధితులకు న్యాయం చేయాలి “

Related image


" కొన్ని కులాలు ఎక్కువ అధికారం కలిగి ఉన్నాయి. నేను దాన్ని కాదనడం లేదు. ఏ అగ్ర కులాన్ని తిట్టకుండానే.. అణగారిన కులాలకు న్యాయం చేసే సత్తా తెగింపు ఉన్న వ్యక్తిని నేను.అలాగే ప్రతి కులంలోనూ తమ కులాన్ని అభిమానించే హార్డ్ కోర్ వ్యక్తులు ఉంటారువాళ్లకు వాళ్ల కులమే ఇష్టం.. మనం దాన్ని కాదనలేం."

Image result for PAWAN KALYAN SPEECH


" నేను సమాజానికి నాయకత్వం వహించే వ్యక్తిగా. కాకుండా ఒ కుల నాయకుడినైతే నేను మాట్లాడే తీరు వేరే ఉంటుంది. మనకు బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తి. అణగారిన కులాలకు న్యాయం చేయాలి. కానీ అందుకు అగ్రకులాలను తిట్టాల్సిన పని లేదు. కించపరచాల్సిన పని అంతకన్నాలేదు. అది జనసేన సంస్కృతి కాదు."


మరింత సమాచారం తెలుసుకోండి: