రెండు రెండు కలిస్తే నాలుగు ఇది గణితం. కానీ రాజకీయాల్లో అలా కాదు, ఆరైనా అవొచ్చు, నూరైనా కావచ్చు. ఈ రాజకీయ గణితం బాగా నేర్చిన వారు వేస్తున్న ఎత్తులు  ప్రతీ ఎన్నికల్లో విజయావకాశాలను ప్రభావితం చేయడం చాలా చోట్ల కనిపిస్తూనే ఉంది. అయితే అన్ని సార్లు అవి ఫలించవు కానీ ఆ ప్రయోగాల మీద మోజు మాత్రం తగ్గలేదు


వ్యతిరేక ఓటు :


అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉంటుంది. దాన్ని ఎంత వరకూ తగ్గించుకోగలమన్నది  ఆ ప్రభుత్వం మొదట చేసే ఆలోచన. అది వల్ల కాదు అనుకున్నపుడు దాన్ని వీలైనంత వరకూ చీల్చే పనికి రెడీ అవుతుంది. అలా చూసుకుంటే ఏపీలో ఇపుడు ఏపీలో రెండు రకాల ప్రయోగాలను ఏక కాలంలో టీడీపీ అధినేత చేస్తున్నారనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం చేయాల్సినదంతా చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో కలివిడిగా పోటీ చేసిన వారంతా ఇపుడు విడిగా బరిలోకి వస్తున్నారు. 


ఆలా మోహరింపు :


అప్పట్లో బీజేపీతో జట్టు కట్టిన బాబు ఆ పార్టీకి రాం రాం అనేశారు. దాంతో ఆ పార్టీది ఒంటరి పోరు, బాబు ప్రభుత్వాం  మీద యుధ్ధమే చేస్తోంది. ఇక మరో పార్టీ జనసేన ఆ పార్టీ అధినేత పవన్ సైతం వామపక్షాలతో కలసి విడిగా పోరుకు సిధ్ధపడుతున్నారు. ఇక కాంగ్రెస్ టీడీపీ కొత్త బంధం అందరికీ తెలిసిందే. తెలంగాణాలో రెండు పార్టీలూ కలసి పోటీ చేశాయి. ఏపీలో మాత్రం విడిగానే పోటీ చేయాలనుకుంటున్నాయాట. ఈ మేరకు బాబు రాజకీయ ప్రయోగం రెడీ చేసి పెట్టుకున్నారు. ఆయన పలు అంతర్గత సర్వేలు నిర్వహించిన మీదట కాంగ్రెస్ తో ఏపీలో కలసి వెళ్తే ఇబ్బంది తప్పదని భావించారని టాక్. కాంగ్రెస్ మీద విభజన చేసిన పార్టీ అన్న ఆగ్రహం ఇంకా చల్లారలేదని  పైగా ఎంత వరకూ ఆ ఓటు బ్యాంక్ కలసి వస్తుందో తెలియదని బాబు టీం భావిస్తోందని  టాక్. 


చీల్చే పార్టీగా :


అందువల్ల కాంగ్రెస్ తో లోపాయికారీ స్నేహం కొనసాగిస్తూ విడిగా పోటీ చేయించాలని బాబు ఆలొచిన్స్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మధ్యన డిల్లీ వెళ్ళిన బాబు ఇదే విషయాన్ని రాహుల్ కి కూడా చెప్పి ఓకే అనిపించుకున్నారని కూడా అంటున్నారు. ఈ రకంగా చేయడం వల్ల ఏపీలో టీడీపీకి రెండు రకాల ప్రయోజనాలు సమకూరుతాయి. మొదటిది. కాంగ్రెస్ తో పొత్తు అన్న మకిలి అంటుకోదు. అదే సమయంలో వారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాస్తో కూస్తో తమతో తీసుకెళ్తారు. అది చాలు బాబుకు వైసీపీ నుంచి బెడదను తప్పించుకుందేందుకు. ఇక పవన్ వామపక్షాలు కూడా మరో కూటమిగా మారి ఏపీలో బాబు వ్యతిరేక ఓటునే టార్గెట్ చేయబోతున్నాయి. బీజేపీ కూడా బాబు మీదనే సమరం చేస్తోంది. 


వైసీపీకి దెబ్బేనా :


ఇక ఈ రకమైన రాజకీయ ముఖ చిత్రం వచ్చే ఎన్నికల్లో ఏపీలో చోటు చేస్తుకుంటే అది వైసీపీకి ఓ విధంగా దెబ్బేనని అంటున్నారు. ఎలాగంటే  ప్రభుత్వ అనుకూల ఓటు ఎటూ చంద్రబాబుకే పడుతుంది. ఆయన్ని వ్యతిరేకించే వర్గాల ఓటు మాత్రం నాలుగు భాగాలుగా చీలిపోతుంది మెజారిటీ భాగం వైసీపీకి పడిందనుకున్నా మిగిలిన పార్టీలు కూడా ఆ ఓటునే పంచుకోవడానికి పోటీ పడతాయి. ఈ రాజకీయ గణితంలో టీడీపీకే ఎక్కువ ప్రయోజనం సమ‌కూరుతుందని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. మరి దీనికి విరుగుడుగా వైసీపీ ఏ రకమైన ప్రయత్నాలు చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: