ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి.  మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్య పార్టీ నేతలు ప్రచారాలు ముమ్మరం చేశారు.  ఈ మద్య జంపింగ్ రాయుళ్లు కూడా తమకు అనుకూలమైన పార్టీల్లోకి జంప్ అవుతున్నారు.  అయితే ఎవరు ఏ పార్టీలో చేరుతున్నారో ఎందుకు చేరుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.  మరోవైపు ముఖ్య పార్టీలు తమ గెలుపు ఖాయం అని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


జనసేనకు సీట్లు రావని చెబుతున్న నేతలు ఇప్పుడు తమతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని వైసీపీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.  ఈ మద్య జనసేన పార్టీపై రక రకాల రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే.  ఆ మద్య సీఎం చంద్రబాబు నాయుడు తమతో జనసేన పార్టీ కలిసి రావాలని అన్నట్లు వార్తలు వచ్చాయి..మొన్నటి వరకు స్నేహితులుగా ఉన్న చంద్రబాబు, పవన్ ఉన్నట్టుండి విడిపోయారు..ఒకరిపై ఒకరు దూషనలు చేసుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలవారీగా నేతలతో సమీక్షలు జరుపుతున్న పవన్.. కృష్ణా జిల్లా నేతలతో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.


పవన్ కళ్యాన్ మాట్లాడుతూ..  జనసేన మాతో కలిసి రావాలని చంద్రబాబు చెప్పినా, తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ మీరు కలిసి పనిచేయాలని చెప్పినా.. అది మన బలాన్ని సూచిస్తున్నాయి. ఇదే మనకు కొండంత బలం అని..మన స్టామినా ఏంటో ఎన్నికల్లో నిరూపించాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. మనకు బలం ఉందని తెలుసు కాబట్టే పొత్తు కోసం వాళ్లంతా ముందుకు వస్తున్నారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: