వచ్చే ఎన్నికలు వైసీపీకి అత్యంత కీలకం. ఆ పార్టీకి చావో రేవో అన్నట్లుగా జరగనున్నాయి. ఏపీలో అధికార టీడీపీతో ఢీ అంటే ఢీగా పోరాడుతున్న వైసీపీకి పీఠం దక్కడం చాలా ముఖ్యం. ఇపుడు కీలకమైన మలుపులో ఉన్న ఫ్యాన్ పార్టీ  అన్ని అస్త్రాలను సంధిస్తూ గెలుపు పిలుపు కోసం ఎదురుచూస్తోంది


పోటీ చేయను :


ఈ నేపధ్యంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మ తాను ఎన్నికల్లో పోటీ చేయడం చేయడంపై ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ,  ఆసకికరమైన కామెంట్స్ చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ  చేయనని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అయితే పార్టీ కోసం ప్రచారం మాత్రం నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రజలు ఇపుడు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని కూడా ఆమె అన్నారు. . జగన్ చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన లభించిదని, వచ్చేది వైసీపీ సర్కారేనని కూడా ధీమా వ్యక్తం చేశారు. 


బాబు విఫలం :


ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు దారుణంగా విఫలం అయ్యారని విజయమ్మ హాట్ కామెంట్శ్ చేశారు. . అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడంలేదని, అందువల్లనే తమ ఎమ్మెల్యేలు వెళ్ళడం లేదని ఆమె అన్నారు. బాబు స్వార్ధం కోసం హోదాను కూడా వాడుకున్నారని ఆమె అన్నారు. ప్రత్యేక హోదా తమ లక్ష్యమని, దాన్ని సాధించి తీరుతామని గట్టిగా చెప్పారు. ఇదిలా ఉండగా విజయమ్మ గత ఎన్నికల్లో విజయమ్మ విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: