“2019 ఎన్నికల్లో 'నరేంద్ర మోదీ'కి, 'నాయకుడు లేని ఒక కలగూరగంప కూటమి' కీ మధ్య పోరాటం జరగబోతోంది. మోడీ ని అధికారంలోకి రాకుండా చేయాలనేది మాత్రమే వారి ఏకైక సైద్ధాంతిక యుద్దం. ఇందులో ప్రజాసేవ దేశభక్తి  దేశ వికాసం  అనే ప్రమేయంలేని వారు అందరూ కలసి ఒక నరేంద్ర మోడీపై చేసే యుద్ధం. 1950లో పుట్టిన జనసంఘ్‌, ఉద్భవించి నాటి సిద్ధాంతాలతో మనం ముందుకు సాగుతున్నాం. ఈ ప్రయాణంలో సిద్ధాంతాలతో రాజీ పడలేదు. ఇందులో వచ్చే ఫలితం ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుంది’’ అన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా.
bjp national council meeting Delhi కోసం చిత్ర ఫలితం 
‘‘1761లో మూడో పానిపట్‌ యుద్ధం జరిగింది. మరాఠాలు ఓడిపోయాక దేశం 200ఏళ్లపాటు బ్రిటి్‌ష్ వారి చేతుల్లోకి పోయింది. ఆనాడు జరిగిన యుద్ధం నిర్ణయాత్మకమైంది. ఇపుడు దేశం అదే పరిస్థితుల్లో ఉంది. 70 ఏళ్ల పాటు ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఈ దేశం మళ్లీ అరాచకంలోకి జారిపోరాదు. నిర్ణయాత్మకైన 2019 పోరులో బీజేపీ గెలవాలి. గెలుస్తుంది కూడా. వచ్చే లోక్‌సభ ఎన్నికలు మరో పానిపట్‌ యుద్ధం లాంటిదని బీజేపీ అభివర్ణించింది.  ఇది మనకంటే దేశప్రజలకే ఎక్కువ అవసరం. ఎందుకంటే అభివృద్ధి ఆగిపోరాదు. 2014 లో కంటే అత్యధిక సీట్లు గెలిచి ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకి వస్తుంది’’  అని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా శుక్రవారం ప్రారంభమైన జాతీయ మండలి సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. 
bjp national council meeting Delhi కోసం చిత్ర ఫలితం
"నరేంద్రమోదీని రాజకీయ అధికారం నుండి తప్పించటం అంత సులువేం కాదని, ఒకప్పుడు కాంగ్రేస్ కు వ్యతిరేకంగా అంతా ఏకమయ్యేవారని, ఇపుడు నరేంద్ర మోదీ, ఆయన నాయకత్వం లోని బిజెపిని వ్యతిరేఖంగా నిలబడి ఎదుర్కోగలసత్తా ఏ ఒక్క జాతీయ పార్టీకి గాని ప్రాంతీయ పార్టీలకుగాని లేకపోవటంతో వారి మద్య సిద్ధాంత సామీప్యం, సమసిద్ధాంతంగాని లేకపోవటం తో అధికారమే పరమావధిగా - ఒక నాయకుణ్ని ప్రధానిగా ప్రకటించటం చేతగాకున్నా- అంతా ఏక మవుతున్నారని అన్నారు. నరేంద్ర మోదీని, బిజేపిని ఎన్నికల సమరంలో ఓడించడం    అసాధ్యమని వారు భావించడమే "మోదీ బలాన్ని వారు అంగీకరిస్తున్నట్లు భావించాలి-పరిస్థితి 'మోడీ వర్సెస్ ఆల్' అనే నిర్ద్వంధంగా చెప్పాలి"  అని అన్నారు. 
bjp national council meeting Delhi కోసం చిత్ర ఫలితం
మా వైపు మోదీ ఉన్నారు మరి మీ వైపు ఎవరున్నారు? అని ప్రశ్నించారు. దీనికి సమాధానం వారు చెప్పలేరు. ఒకవెళ చెప్పటానికి ప్రయత్నించిన కూటమి సుమాలను కూర్చిన ఆ బలహీన దారం పుటుక్కున తెగిపోతుంది. గతంలో స్టాలిన్ రాహుల్ గాంధిని ప్రధానిగా ప్రకటించిన మాత్రానే కూటమి పునాదులు కదిలేలా ప్రకంపనలు వచ్చాయి. ఇక వీరు భారతజాతి కోసం దాన్ని ఐఖ్యంగా ఉంచటానికి ఏమీ చేయలేరని అర్ధమౌతుందని బిజెపీ భావిస్తుంది. 
modi vs all cartoon కోసం చిత్ర ఫలితం

అయోధ్యలో రాముడు జన్మించిన చోట భవ్యమైన మందిరం నిర్మించాలని బీజేపీ కోరుకుంటున్నదని, అక్కడ మందిరం నిర్మించాల్సిన బాధ్యత తమపై ఉన్నదని ఆయన చెప్పారు.
 


నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం దేశ రూపురేఖల్నే మార్చేసే నిర్ణయాలను తీసుకున్నదని అమిత్‌ షా ప్రశంసించారు. త్రిపుల్ తలాక్‌ నుంచి హజ్‌-సబ్సిడీ వరకు, జీఎస్టీ నుంచి పెద్దనోట్ల రద్దు వరకు బృహత్తర మార్పునకు నాంది పలకామని చెప్పారు. పొరుగు దేశాల్లో వేధింపులకు గురై భారత దేశానికి తిరిగి వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైన్లను అక్రమ వలసదారు లుగా భావించకుండా పౌరసత్వ బిల్లు ప్రవేశ పెట్టామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ నెరవేరిందని అన్నారు.
modi vs all cartoon కోసం చిత్ర ఫలితం
దేశంలో అవినీతికి నాయకత్వం వహించింది కాంగ్రెసేనని, కాంగ్రెస్‌ హయాంలో దేశం అభద్రతా భావంలో జీవించిందని ఆయన అన్నారు.
 

మేనత్త-మేనల్లుడు (మాయావతి-అఖిలేశ్‌) పొత్తు పెట్టుకుంటే దేశానికి ప్రజలకు ఒరిగేదేంటి? మొత్తం అంతా మారి పోతుందా? ఏళ్ల తరబడి ఒకరి ముఖం ఒకరు కూడా చూసుకోలేదు. ఇపుడు బీజేపీమీద వ్యతిరేకతతో కలిశారు. ప్రజలు తెలివైనవారు. అని వ్యాఖ్యానించారు.

సంబంధిత చిత్రం

రాజకీయం ఫిజిక్స్‌ కాదు. కెమిస్ట్రీ. రెండు పదార్థాలు కలిసినపుడు ఊహించని కొత్త పదార్థం ఉత్పన్నమవుతుంది. అనుకోని విపరిణామాలుంటాయి’’అని వ్యాఖ్యానించారు.  గతంలో బీజేపీ కేవలం ఆరురాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఇపుడు ఆ రాష్ట్రాల సంఖ్య 16కు పెరిగిందన్నారు. బెంగాల్‌, కేరళల్లో సైతం చొచ్చుకుపోతామన్నారు.
 


బీజేపీ జాతీయమండలి సమావేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు భారీగా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి దాదాపు 280 మంది, ఏపీ నుంచి 200 మంది వరకు వచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాల అధ్యక్షులు కె.లక్ష్మణ్‌, కన్నా లక్ష్మీ నారాయణ, నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, రాజాసింగ్‌, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



మరో సందర్భంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. అధికార పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నందునే ఆంధ్రప్రదేశ్ లోకి సిబిఐ ప్రవేశాన్ని నిషేధించారని. వారేవిధమైన అవినీతి చేయ నపుడు సిబిఐని ఎందుకు  అడ్డుకుంటున్నారు  అని మోడీ వ్యాఖ్యానించారు.పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సీబీఐ ప్రవేశాన్ని నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఆక్షేపించారు.
modi vs all cartoon కోసం చిత్ర ఫలితం
తాను గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో సిబిఐని కేంద్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, తను తప్పు చేయలేదు కనుక తనపై కేంద్రం వేసిన సిబిఐ విచారణ ను అడ్డుకోలేదని ఆయన అన్నారు. తాను ఏ తప్పు చేయనందుకే చట్టాన్ని గౌరవించి విచారణను ధ్యైరంగా ఎదుర్కొన్నామని మోడీ అన్నారు.
states declared no entry to cbi కోసం చిత్ర ఫలితం
ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్‌ రెండో రోజు సమావేశంలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ పాలన కారణంగా పదేళ్లు దేశం అంధకారంలోకి వెళ్లిపోయిందనీ, విలువైన సమయాన్ని కాంగ్రెస్‌ పాలకులు వృథా చేశారని మండిపడ్డారు. ఆ పదేళ్లు దేశ మంతా అవినీతి స్కాంలు, కుంభకోణాల్లో మునిగి తేలిందని మోడీ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: