పండుగ అంటేనే మన సంస్క్రుతి సంప్రదాయాలు పాటించడం. ఆధునిక జీవన శైలిలో నలిగిపోతున్న మానవుడు తాను ఎక్కడ ఉన్నాడో  ఒకసారి చూసుకోవడం. తన పూర్వీకులు ఏర్పాటు చేసిన కట్టు బాట్లు, కట్టే బట్టలు అన్నీ కూడా సరి చూసుకోవడం. భారతీయ జీవన విధానంలో ప్రతి పండుగకూ ఓ విశేషం ఉంది. ప్రతి వేడుకకూ ఓ అర్ధమూ పరమార్ధమూ ఉంది


మనదైన పద్ధతి :


మన తెలుగు  ఆడపిల్లలు పట్టు పరికిణీలు, లంగా ఓణీలు కట్టి ఇంట్లో నడయాడుతూంటే పండుగ దానికదే వచ్చేస్తుంది. ప్రతి ఆదపిల్ల ముఖంలో లక్ష్మీ కళ తాండవిస్తుంది. చక్కగా తీర్చిదిద్దిన కుందనపు బొమ్మే ప్రతీ ఆడపడుచు అవుతుంది. నుడుటన కుంకుమ బొట్టు, కళ్ళకు కాటుక, కాళ్ళకు పారాణి, పసుపు నిండారపూసుకున్న నిగనిగల శరీర  చాయతో తెలుగింటి ఆడపిల్ల కదలాడుతూంటే ఆ ఇల్లు సంక్రాంతి కాక మవుతుంది. ఏ అభరణాలు అవసరం లేని విధంగా చిక్కని చిరునవ్వులతో దివ్వెల  వెలుగులు తెస్తే ఆ కాంతులతో పచ్చగా ప్రతి లోగిలి కళకళ్లాడుతుంది.


అందం అక్కడే :


అందం ఎక్కడ ఉంది అంటే చూసే కళ్ళలో అని చెప్పాలి. మరి అలా చూడాలంటే నిండైన, సొంపైన వస్త్రధారణ చాలా ముఖ్యం. మన విధానంలో ఈడుకొచ్చిన ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకుంటే చాలు ఆ అందం అలా వచ్చేస్తుంది. చూడ చక్కగా ఉంటారు. ఇపుడు ఆ విధంగానే మరో మారు సంక్రాంతి పండుగ ద్వారా మన తెలుగు అందాలు ముచ్చట చేస్తున్నాయి. పల్లెటూళ్ళన్నీ పరువాలతో పదహారేళ్ళ ఆడపిల్లను తలపిస్తున్నాయి. వయోభేదం లేకుండా  అందరూ కలసి విందులు చేస్తుకుని తెలుగు పండుగల గొప్పతనాన్ని చాటి చెబుతున్నారు. మన పండుగ అంటే ఇదీ అని ఘనంగా చాటి చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: