ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డి పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఎ విచారణ చేప్పట్టడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచిత్రమైన వాదన చేస్తున్నారు. విమానా శ్రయంలో భద్రతా వ్యవహారాల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, అక్కడ జరిగే ఘటనలపై విచారణ జరిపే బాధ్యత మాత్రం తన రాష్ట్ర ప్రభుత్వానిదని ఆయన అన్నట్లు సమాచారం.


విమానాశ్రయంలో భద్రతా వ్యవహారాల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, అక్కడ జరిగే ఘటనలపై విచారణ జరిపే బాధ్యత మాత్రం తన రాష్ట్ర ప్రభుత్వానిదని ఆయన అన్నట్లు సమాచారం. విమానాశ్రయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనా దానిపై విచారణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. చంద్రబాబు శనివారం అమరావతి నగరంలోని ఉండవల్లి లోని గ్రీవెన్స్‌-హాలు లో జరిగిన మీడియా సమావేశంలో వ్యక్తపరచారు. ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్‌ఐఏ కు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంబంధిత చిత్రం

రాష్ట్ర అధికారాన్ని కేంద్రం ఎలా తీసుకుంటుందని?  ప్రశ్నించారు. హత్యాయత్నం జరిగిన ఎయిర్‌-పోర్టు తమ పరిధిలో లేదని, కేంద్రం పరిధిలో ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ఆధీనంలోని ఎన్‌ఐఏ విచారణను ఎలా తప్పుపడతారు? అని ప్రశ్నించగా, ఎయిర్‌-పోర్టులో భద్రత మాత్రమే కేంద్రం చూసుకోవాలని, అక్కడ శాంతి భద్రతలు విఫలమైతే వాటిపై రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందన్నారు. రాష్ట్ర సార్వభౌమాధికారాన్నికేంద్రం హరిస్తోందని ఆరోపించారు (రాష్ట్ర ప్రభుత్వాలకు సార్వ భౌమ అధికారాలు ఉండవని తెలియనివారు మనకు ముఖ్య మంత్రులని ఇప్పుడే తెలిసింది)


అసలు చంద్రబాబు ఒక నిజం మరిచారు. కాదు దాచిపెట్టారు. ఈ దర్యాప్తును ఎన్ ఐ ఏ కు ఒప్పగించ మని ఆదేశించింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. న్యాయస్థాన ఆదేశాలను కేంద్రాన్ని బేఖాతర్ చేయమంటారా? ముఖ్యమంత్రిగారూ! ఇది ప్రజల ప్రశ్న.  

murder attempt on jagan mohan reddy & NIA కోసం చిత్ర ఫలితం

వైసిపి అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎన్‌ఐఏ చర్యలు చేపడితే మీకెందుకు భయం అంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు ప్రశ్నించారు. జగన్మోహనరెడ్డి పై జరిగిన హత్యాయత్నాన్ని చంద్రబాబు డ్రామాగా చిత్రీకరించారంటూ మండిపడ్డారు.

murder attempt on jagan mohan reddy & NIA కోసం చిత్ర ఫలితం

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, అనేక సందర్భాల్లో ఆయన మాట మార్చారని అన్నారు. ఏపీలో ఉన్నది అధ్వాన్న ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ తో కుమ్మక్కైన వారు వేల కోట్ల రుణాలు లబ్ధిపొంది విదేశాలకు పారిపోయారని ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం కొనసాగు తోందని విమర్శించారు. అవినీతి, అసూయతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు.

gvl narasimha rao కోసం చిత్ర ఫలితం

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడిలో తన ప్రమేయం ఉంది కాబట్టే చం‍ద్రబాబు భయపడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విమానాశ్రయంలో దాడి జరిగింది కాబట్టి కేంద్రానిదే బాధ్యత అన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి సహకరించమని చెబుతున్న మాటలను ప్రజలకు అర్థం చేసుకోవాలని కోరారు. 

సంబంధిత చిత్రం

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను అవినీతి పేరుతో చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు దోచుకున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే దేశాభివృద్ధిగా భావించి పథకాల కేటాయింపుల్లో నరేంద్ర మోదీ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

chandrababu Vs jagan case కోసం చిత్ర ఫలితం

వాల్మీకీ, బోయల సమస్యను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. నరేంద్ర మోదీ మరో సారి ప్రధానమంత్రి అవడం దేశానికి అవసరమని చెప్పారు. అరాచక శక్తుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.


శ్రీనివాసరావు పై ఎన్ ఐ ఏ విచారణకు సిద్ధం 


వైసీపీ అధినేత జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు‌ ను విచారించటానికి విశాఖపట్టణం నుండి హైద్రాబాద్‌ కు ఎన్ఐఏ అధికారులు తరలిస్తున్నారు. విశాఖలో శ్రీనివాసరావు విచారణ సురక్షిటం కాదని అందువలననే హైద్రాబాద్‌ కు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్ఐఏ శ్రీనివాసరావు ను విశాఖ బక్కన్నపాలెం సీఆర్‌పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్  లో ఉంచినట్లు గా శ్రీనివాసరావు న్యాయవాది సలీంకు ఆదివారం నాడు ఉదయం సమాచారం ఇచ్చారు. 



చెన్నై, కోల్కత్తా, ఢిల్లీలాంటి ప్రాంతాల్లో శ్రీనివాసరావును విచారించే అవకాశం పరిశీలనలో ఉందని ప్రచారం సాగుతోంది.
ఈ కేసు విచారణను ఎన్ఐఏ చేపట్టడాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పుబడుతూ కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏపీ సీఎం ప్రధానికి లేఖ కూడ రాసిన దరిమిలా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, ఏవైనా సురక్షితప్రాంతాలకు తరలించి విచారణ జరపుతామని ఎన్ఐఏ అధికారలు తనకు స్పష్టం చేశారని లాయర్ సలీం ప్రకటించారు.



ఎక్కడికి తరలించే విషయాన్ని, తరలింపుకు రెండు గంటల ముందుగా సమాచారం ఇస్తామని ఎన్ఐఏ అధికారులు తనకు సమాచారం ఇచ్చినట్లు సలీం చెప్పారు. ఇంతవరకు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు విచారణ చేయలేదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: