వచ్చే ఎన్నికల్లో మరో మారు అధికారం కోసం టీడీపీ, ఈసారి ఎలాగైన అధికారం చేపట్టాలని వైసీపీ గట్టిగా పోరాడుతున్నాయి. ఇంకోవైపు పార్టీ పెట్టి తాను అధికారంలోకి రావాలని జనసేన అధినేత పవన్ కోరుకుంటున్నారు. త్రిముఖ పోటీ ఏపీలో అనివార్యం అయిన వేళ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి.


బాబుపై కక్షట :


తెలుగుదెశం అధినేత చంద్రబాబుపై కక్ష సాధించడం కోసం ఏపీలో వైసీపీకి టీయారెస్ మద్దతు ఇస్తోందని పవన్ సంచలన కామెంట్స్ చేశారు.  గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పవన్‌ పాల్గొన్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు. గతంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జగన్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని అన్నారని, వారే ఇప్పుడు చంద్రబాబు గారిపై కక్ష సాధించేందుకు జగన్‌కు మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు పట్ల పవన్‌కున్న సానుకూలతను ఆయన తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయని అపుదే ప్రచారం మొదలైంది.
 ఇంతవరకూ ఇవే మాటలను చంద్రబాబు పదే పదే అంటున్న సంగతి విధితమే. ఇపుడు పవన్ కూడా అనడం ఏపీ రజకీయాల్లో కీలక పరిణామమే అంటున్నారు. నిజానికి పవన్ చాన్నాళ్ళ తరువాత బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై వాడి వేడి కామెంట్స్ చేశారు. ఏపీకి జగన్ ఏం చేశారని అధికారం కోరుకుంటున్నారని పవన్ ప్రశించడం ఈ సందర్భంగా గమనార్హం. జగన్ యువత, రైతుల గురించి ఆలోచన చేయడం లేదని కూడా పవన్ ఆరోపించారు. జగన్ అధికారం కోసం అన్నీ చేస్తున్నారని కూడా విరుచుకుపడ్డారు. 


బాబు పై సాఫ్ట్ కార్నర్ :


ఇక ఇదే సభలో పవన్ చంద్రబాబుపైన మునుపటి మాదిరిగా మాటల దాడి చేయకపోవడం గమనించాల్సిన విషయమే. మామకు వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్నారని చంద్రబాబును అంటారని తనకు ఆ విషయంలో క్లారిటీ లేదన్నట్లుగా మాట్లాడడం విశేషం. మరి అధీకారంలో అయిదేళ్ళ పాటు ఉన్న ఒక పార్ర్టీని సుతిమెత్తగా కామెంట్స్ చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఏం చేశావని నిలదీయడం ద్వారా పవన్ తన వైఖరిని చాటుకుంటున్నారని వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు.


టీయారెస్ పైన :


ఇక పవన్ కళ్యాణ్ కు టీయారెస్ పైన అంత కోపం ఉంటే కేసీయార్ ని అప్పట్లో డైరెక్ట్ గా కలసి మంతనాలు సాగించినది ఎందుకని కూడా సెటైర్లు  పడుతున్నాయి. అంతే కాకుండా తెలంగాణా  ఎన్నికల్లో పోటీ పెట్టకుండా పరోక్షంగా మద్దతు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయని, ఇక కేసీయార్ గెలిచిన తరువాత పవన్ ఒక అభినందన లేఖను కూడా విడుదల చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. మరి ఇంతలో ఏమైందో ఏమో టీయారెస్ పై దాడి చేస్తూ అచ్చం చంద్రబాబు మాటలనే పవన్ కూడా తన నోటి వెంట అనడం పట్ల ఏపీ రాజకీయాల్లో సంచలనం అవుతోంది. పవన్ అనే ఫ్యాక్టర్ ఏపీ రాజకీయాలకు అతి ముఖ్యమైన వేళ మరో మారు ఆయన చక్రం టీడీపీ వైపు తిరుగుతోందా అన్న డౌట్లను ప్రత్యర్ధి పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: