ఎన్నికలు వస్తున్నాయంటే కొందరికి హుషార్, కొందరికి బేజారు. రాజకీయాల్లో తామే శాశ్వతం అని భావిస్తూ సీటుకు అతుక్కుపోయే వారంతా మళ్ళీ జనం వద్దకు వెళ్ళాలంటే తెగ పరెషాన్ అవుతారు. టికెట్లు తెచ్చుకోవడం, ప్రచారం, ఎన్నికలు ఇలా బోలేడు తతంగంతో తల బొప్పి కడుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఈ మొక్కుబడి తంతు తప్పదు కదా..


సిట్టింగులకు కంగారే :


ముందస్తుగా క్యాండిడేట్లను ప్రకటిస్తానని చంద్రబాబు చాలాకాలంగా చెబుతున్నారు. అంటే ఎన్నికలు కొన్ని నెలలు ఉండగానే ఉన్న అధికారానికి ఎసరు వస్తుందన్న మాట. టీడీపీలో ఇపుడు   దానిపైనే  పెద్ద కసరత్తు జరుగుతోంది. ఉన్న ఎమ్మెల్యేల్లో చాలామంది మీద వ్యతిరేకత ఉందని ఆ పార్టీ భావిస్తోంది. అందువల్ల వారిని ఎలాగైనా తప్పించాలనుకుంటోంది. మొత్తంగా చూస్తే నలభై మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెలేలకు ఈసారి సీటు చిరిగిపోతుందని అంటున్నారు. 


ఫిరాయింపు కంపేనట :


వీరిలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. ముఖ్యంగా రాయలసీమలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మెజారిటీకి ఈసారి టికెట్ దక్కదని అంటున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే నలభై మంది పై వేటు పడుతుందని కూడా అంటున్నారు. అయితే ఒకేసారి ఇంతమందిని తప్పిస్తే ఎలా ఉంటుందన్నది టీడీపీ  హై కమాండ్ ని కలవరపరుస్తోందట. వారికి టికెట్లు ఇవ్వకపోతే వీరంతా వేరే పార్టీలోకి వెళ్ళిపోతారేమోనని కూడా భయపడుతున్నారట.


అందుకే జాప్యం :


ఈ కారణంగానే జనవరిలో అభ్యర్ధుల ప్రకటన ఉంటుదని అనుకున్నా ఇపుడు దాన్ని ఫిబ్రవరికి మార్చారని సమాచారం. ఫిబ్రవరి 10 తరువాతనే టీడీపీ మొదటి జాబితా వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఆ జాబితాలో పక్కాగా గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అవుతున్నారట. అదే సమాయంలో పని చేయని వారికి, జనంలో బ్యాడ్ రిపోర్ట్ ఉన్న వారికీ టికెట్లు దక్కవని కూడా చెబుతున్నారు. మరి ఈ పరిణామం పసుపు పార్టీలో ఎలాంటి అలజడి  తెస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: