తొండ ముదిరితే ఊసరవెళ్లి అవుతుందని సామెత. ఇప్పుడు దాన్ని తిరిగిరాసుకోవాల్సిన సమయం వచ్చేసింది. సినీనటుడు రిటైరైతే రాజకీయ నాయకుడు అవుతాడని మారిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సినీరంగంలోని చాలామంది చూపు రాజకీయాలవైపే మళ్లుతోంది మరి.

Related image


తాజాగా మాజీ సెక్సిణి షకీలా కూడా రాజకీయాల వైపు చూస్తోందట. ఇటీవల తమిళనాడులో సినీనటుల పార్టీలు సందడి చేస్తున్నాయి. తమిళ టాప్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ చెరో పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు షకీలా రజినీకాంత్ పార్టీవైపు మొగ్గు చూపుతోందట.

Image result for shakeela kamal haasan


తన అభిమాన నటుడు కమల్‌ హాసన్‌ ఆహ్వానిస్తే.. ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని షకీలా అనౌన్స్ చేసింది. కమల్‌హాసన్‌ రాజకీయ నాయకుడిగా మారడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందంటోంది షకీలా. కమల్ తనకు ఛాన్స్ ఇస్తే కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యంలో చేరి ప్రజాసేవ చేస్తానంటోంది.

Image result for shakeela sexy


మరి రాజకీయాల్లోకి వస్తే మీ సెక్సీ ఇమేజ్‌ అడ్డంకి కాదా అని అడిగితే.. దాని ప్రభావం రాజకీయాలపై ఉండబోదని నమ్మకంగా చెబుతోంది. తనపై సెక్స్ బాంబ్ అని ముద్రపడటంపై ఆమె విచారం వ్యక్తం చేస్తోంది. కుటుంబ పరిస్థితుల కారణంగానే తాను సినిమాల్లో అలా నటించాల్సి వచ్చిందని చెబుతోంది. మరి కమల్‌ హాసన్ షకీలా కోరిక తీరుస్తాడా.. ?


మరింత సమాచారం తెలుసుకోండి: