ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వేయడంతో వెంటనే రిపేర్ కార్యక్రమాలు మరియు ఇతర పార్టీల వైపు మద్దతు కోసం ఇప్పటి నుండే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రస్తుతం మోడీ చేస్తున్న సర్వేల బట్టి అర్థమవుతుంది. 2014 ఎన్నికలలో ఏ పార్టీ మద్దతు లేకుండా సొంతంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి కొన్ని అనివార్య నిర్ణయాల వల్ల అతి తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకత ఎదుర్కొంది.

Related image

ఈ క్రమంలో త్వరలో 2019 పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ప్రాంతీయ పార్టీ మద్దతు తప్పనిసరి అని గ్రహించిన మోడీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి తనకు సంబంధించిన నిఘా వర్గాల ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నారు. అయితే మోడికి అందిన సమాచారం మేరకు త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తేలినట్లు సమాచారం.

Image result for modi

ముఖ్యంగా పార్లమెంట్ స్థానాలలో కనీసం 15 నుండి 20 స్థానాలు వరకు జగన్ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెంట్ రిపోర్ట్ అందినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సర్వేలో వచ్చిన ఫలితాలు చూసి మోడీ షాక్ తిన్నారట. మరోపక్క జాతీయ సర్వేలలో కూడా జగన్ రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి మరియు దేశ రాజకీయాలలో కీలకం కాబోతున్నట్లు కథనాలు కూడా ప్రసారం చేశాయి.

Image result for modi

ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంద‌కు పూర్తి మెజారిటీ రాక‌పోతే జ‌గ‌న్‌ను ఏదొక విధంగా త‌న దారికి తెచ్చుకొనేందుకు మోదీ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. మ‌రో వైపు ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని ఎవ‌రు సంత‌కం చేస్తే వారికే త‌మ మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ అనేక సార్లు ప్ర‌క‌టించారు. మ‌రి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని జ‌గ‌న్‌తో దోస్తీ క‌డ‌తారా లేకా ఏదొక విధంగా త‌న దారికి తెచ్చుకుంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: