క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాల కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ లో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీపై ఆయన వద్ద పనిచేసిన ఓ లేడీ డైరెక్టర్ సంచలన ఆరోపణలు చేసింది. సంజు’ సినిమాకు సినిమా సమయంలో హిర్వాణీ తనకు ఆరు నెలలు నరకం చూపించాడని కంప్లయింట్ చేస్తున్నారు.

Related image


సదరు లేడీ డైరెక్టర్ కేవలం మీడియాతో మాట్లాడటం వంటి చర్యలతో కాకుండా ఆ సినిమా నిర్మాతకు ఫిర్యాదు చేసింది. ఆ లేడీ డైరెక్టర్ సంజు’సినిమా నిర్మాత విధు వినోద్‌ చోప్రాకు, అతని సోదరి, భార్యకు మెయిల్‌ పంపింది. హిరాణీ తన పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని ఆ లేఖలో రాసింది.

Image result for rajendar hirani sexual abuse


తాను కేవలం ఆయన వద్ద పని చేసే అసిస్టెంట్‌ను మాత్రమేనని.. తన పట్ల జరిగిన దారుణాన్ని చెప్పుకోలేనని ఆమె వాపోయింది. ఆరు నెలల పాటు హిరాణీ తనను లైంగికంగా వేధించారని.. ఉపాధి పోతుందనే కారణంతో తాను మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఆ లేఖలో చెప్పిందిఉద్యోగం వదిలేస్తే హిరాణీ తన గురించి ఇండస్ట్రీలో చెడు ప్రచారం చేస్తారన్న భయం కూడా ఓ కారణమని ఆ లేఖలో చెప్పింది.

Image result for sexual abuse cinema


లేడీ డైరెక్టర్ ఆరోపణలను దర్శకుడు హిరాణీ తరపు లాయర్ ఖండించారు. హిరాణీ పేరు చెడగొట్టేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. మరి హిరాణీ విషయంలో సంజు నిర్మాత ఎలా రియాక్టవుతారు.. మిగిలిన బాలీవుడ్ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: