టాలీవుడ్ హీరో ప్రభాస్, వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల.మధ్య అక్రమ సంబంధాలున్నాయని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంపై వైఎస్ షర్మిల మొదటి సారి గా మౌనాన్ని వీడి నోరు విప్పారు. తన శీలహననం వెనుక ఖచ్చితంగా టిడిపి హస్తం ఉండి ఉంటుంది అని షర్మిల అన్నారు.  ప్రభాస్‌తో తనకు ఎలాంటి ఏరకమైన సంబంధాలు లేవని స్పష్టం చేసిన ఆమె, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ అసత్య ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్ కమీషనర్ (సీపీ) అంజని కుమార్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. 
sharmila complaint to cp about prabhas & sharmila character assaassination కోసం చిత్ర ఫలితం
ఆ తరవాత ఆమె మీడియా వర్గాలతో మాట్లాడుతూ, 2014 ఎన్నికలకు ముందు తనకు, ప్రభాస్‌ తో సంబంధం ఉందని అసత్య ప్రచారం చేశారని గుర్తు చేశారు. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశా మన్నారు. అయితే అప్పట్లో ప్రచారం ఆగినా, ఇప్పుడు మళ్లీ తిరిగి ఎన్నికలకు ముందు తనపై మరోసారి అసత్య ప్రచారాలు మొదలెట్టి తీవ్రతరం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అసత్య ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించిన ఆమె, దీని నేపధ్యంలో ఎవరున్నా, వారెంతటి వారైనా  వారిపై చర్యలు తీసుకోవాని హైదరాబాద్ సీపీ ని కోరినట్లు షర్మిల తెలిపారు. ఆడవాళ్ల మీద రాష్ట్రమంతటా జరుగుతున్నమానవత్వ రహిత దుష్ప్రచారాలపై కూడా తను సిపి కి వివరించి పిర్యాదు కూడా చేసినట్లు చెప్పారు. ఈ విధంగా దుష్ప్రచారం చేయడం సరైనది కాదన్నారు.
sharmila complaint to cp about prabhas & sharmila character assaassination కోసం చిత్ర ఫలితం
వెబ్-సైట్, సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఎవరు చేయకుండా చర్యలు తీసు కోవాలని కోరారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారే కాకుండా, వాటిని ట్రోల్ చేస్తూ ప్రచారం చేస్తున్న వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ప్రజలు నిజం అనుకునే అవకాశం ఉందని, ఒక తల్లి గా చెల్లి గా నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్న షర్మిల తన గౌరవం కాపాడుకోవాలని బయటకు వచ్చి ఫిర్యాదు చేశానన్నారు.
prabhas & sharmila character assaassination కోసం చిత్ర ఫలితం
తాను ఇప్పటివరకు ప్రభాస్‌ ను ఎప్పుడూ కలవలేదన్నారు. పిల్లల మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను, పుకార్ల పుట్టించి క్యారెక్టర్ ను దెబ్బతీసే విధంగా ప్రచారం చేయడంతో నావాళ్ళు బాధపడ్డారన్నారు. ఈ సోషల్ మీడియా ద్వారా జరిగిన ఈ ప్రచారంలో కొంచం కూడా నిజం లేదన్నారు. దీనివెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. 
prabhas & sharmila character assaassination కోసం చిత్ర ఫలితం
గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పైనా తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. తనపై ఇంతలా ఇంత దుష్ప్రచారం జరుగుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు స్పందించి దానిని అరికట్ట లేదని నిలదీశారు. రాజకీయాలను తన పార్టీవాళ్ళు ఇంతగా దిగజార్చుతున్నా మాట్లాడకుండా ఎలా ఉండగలిగారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని, గుర్తుంచుకొని తగు విధంగానైనా చంద్రబాబు స్పందించాలని షర్మిల అన్నారు.  దోషుల్ని కఠినంగా శిక్షించాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ ను కోరుతూ, ఏపీ పోలీసులపై నమ్మకం లేనందునే, తెలంగాణలో ఫిర్యాదు చేశామన్నారు షర్మిల.

ysr sharmila images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: