కేసీఆర్ ఏపిలో రాజకీయాలని గెలకటం మొదలైనట్లుంది. దీనికి ఫ్లాష్-బాక్ తెలివి ఎక్కువ తనంతో మితిమీరిన అహంభావంతో సైబరాబాద్ ను నేనే నిర్మించాను హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో పెట్టాను అంటూ తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో దుమ్మెత్తిపోస్తూ మొత్తం క్రెడిట్లను తన ఖాతాలో వేసుకొంటూ చేసిన వ్యూహాలే కాదు అక్కడి అధికార పార్టీని వ్యక్తిగతంగా అణగదొక్కటానికి కాంగ్రెస్ మరో రెండు బలహీన పార్టీలను కలుపుకొని ప్రజాకూటమి అనే ఒక రాజకీయ కూటమిని నిర్మించారు. దాని పలితమే అత్యంత అగౌరవప్రద అపజయం మూటగట్టు కొని, ఓడిపోయిన మేనకోడలితో సహా అమరావతికి తిరుగు ప్రయాణం కట్టారు.
talasani in bhimavaram కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు ఎలా అయితే ఎన్నికల్లో తెలంగాణాకి వచ్చి మరీ తనను గెలికారో - దానికి సరిగ్గా సరిపడే రిటర్న్-గిఫ్ట్ ఏపిలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఇస్తానని కేసీఆర్ వాగ్ధానం చేశారు

అక్కడ కట్ చేస్తే నేడు ఇక్కడ 

సోమవారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మూడపాడులో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళనం తలసాని మాట్లాడుతూ,  తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ₹ 5000 కోట్లతో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని,  ఏపీలో కూడా కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి యాదవులకు న్యాయంచేయాలని డిమాండ్‌ చేస్తూ కేసీఆర్ రిటన్-గిఫ్ట్ ఇచ్చే తొలిదశను అమలు పరచారు. 

talasani in vijayavada durga temple & bheemavaram కోసం చిత్ర ఫలితం

అనంతరం ఆయన ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ దుర్గగుడి వరకు భారీ ర్యాలీగా బయలుదేరి దుర్గమాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. చం‍ద్రబాబు నాయుడు ప్రచారానికి పరిమితమైన నాయకుడని విమర్శించారు. ప్రజల సొమ్ముతో ప్రచారాలు చేసుకున్నంత మాత్రాన వాస్తవాలను దాచలేమన్నారు. టీఆర్‌ఎస్‌ కాదు, ఏపీ ప్రజలే చంద్రబాబుకు రిటర్న్‌-గిఫ్ట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

talasani in durga temple vijayawada కోసం చిత్ర ఫలితం

ఏపీలో కుల రాజకీయాలకు కారణం చంద్రబాబు మాత్రమేనని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఎన్ డీ ఏ లో ఉన్నన్ని నాళ్లు భిన్న రకాలుగా మాట్లాడారని విమర్శించారు. హోదాకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Talasani gets a grand welcome in Vijayawada

తెలంగాణ ప్రాంతంలోని బిసిల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తాను ఏపిలో కూడా ఈ సామాజిక వర్గాలకు నాయకత్వం వహించడానికి సిద్దంగా వున్నట్లు తలసాని శ్రీనివాస్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో సరైన నాయకత్వం లేకే బిసిలు మరీ ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం రాజకీయంగా వెనుకబడుతోందని తలసాని పేర్కొన్నారు. ఏపీలోనూ యాదవ నేతలు రాజకీయాల్లో ఎదగాలని తాను కోరుకుంటున్నానని అలా ఎదగాలనుకునే వారికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తలసాని స్పష్టం చేశారు.

talasani in durga temple vijayawada కోసం చిత్ర ఫలితం

ఏటా పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడిపందాలకు తప్పకుండా తెలంగాణా నుంచి వెళ్లే మాజీమంత్రి  తలసాని శ్రీనివాస యాదవ్ ను తొలుత ప్రయోగించ నున్నారని సమాచారం. సంక్రాంతికి భీమవరం వెళ్లే తలసాని అక్కడున్న మావుళ్లమ్మను దర్శించుకుంటారు. కోడిపందాలలో పాల్గొంటారు. భీమవరంలో జరిగే సంక్రాంతి వేడుకల్లో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. అక్కడ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ సామాజిక వర్గానికి తగినన్ని సీట్లిచ్చి గౌరవిచారని ప్రశంసించారు.

talasani in durga temple vijayawada కోసం చిత్ర ఫలితం

అయితే ఏపిలో మాత్రం అలాంటా పరిస్థితులు లేవని యాదవ సామాజిక వర్గానికి చెందిన అతి తక్కువ మంది రాజకీయాల్లో వున్నారన్నారు. ఇలా ఇళ్లల్లో కూర్చొంటే రాజకీయ అవకాశాలు రావని మనవారిని సంఘటితం చేసి రాజకీయంగా ఎదగాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో యాదవులు సంఖ్యాబలం ఏంటో చూపించాలని తలసాని పేర్కొన్నారు.


ఏపీలోనూ యాదవ నేతలు రాజకీయాల్లో ఎదగాలని...ఇలా ముందుకొచ్చేవారి రాజకీయ ఎదుగుదలకు తాను అండగా ఉంటానని తలసాని హామీ ఇచ్చారు. ఏపీలోని రాజకీయ పార్టీలు బీసీలకు పప్పు బెల్లాలు పెట్టి పంపేస్తున్నాయని చట్టసభల్లో మాత్రం అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. తమకు అవకాశం ఇవ్వకుంటే ఎవరినైనా ఓడించాలని తలసాని పిలుపునిచ్చారు.

durga temple vijayawada warns talasani కోసం చిత్ర ఫలితం 

దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడినందుకు తలసాని క్షమాపణలు చెప్పాలి


తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్  విజయవాడ లోని దుర్గమ్మ గుడి సన్నిధిలో  చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆలయ ఆవరణలో  రాజకీయాలు మాట్లాడడాన్ని ఆలయ పాలకమండలి తప్పుబడుతోంది.  

durga temple palaka mandali కోసం చిత్ర ఫలితం

సంక్రాంతి పర్వదినం సందర్భంగా  ఏపీలో  టీఆర్ఎస్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారంనాడు పర్యటించారు. ఈ సందర్భంగా దుర్గమ్మ గుడి సన్నిదిలో మీడియాతో మాట్లాడిన సమయంలో  తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ వ్యాఖ్యలు చేశారు.


దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడడాన్ని ఆయన దుర్గగుడి పాలకమండలి తప్పుబడుతోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడుతున్న ఆలయ సిబ్బంది వారించకపోవడాన్ని పాలకమండలి తప్పుబడుతోంది.

durga temple committee Vs talasani srinivas yadav కోసం చిత్ర ఫలితం

దుర్గమ్మ సన్నిధిలో  తలసాని శ్రీనివాస్ యాదవ్  రాజకీయాలు మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని పాలక మండలి డిమాండ్ చేస్తోంది.తలసాని శ్రీనివాస్ యాదవ్  వ్యవహారాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పాలకమండలి సభ్యులు  చెబుతున్నారు.

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: