జనసేన పార్టీకి ఇప్పటివరకూ కర్త ఖర్మ క్రియ అన్నీ కూడా పవన్ కళ్యాణే. ఆయన చుట్టూనే పార్టీ మొత్తం తిరుగుతోంది. పవన్ కూడా అలాగే పార్టీని ఉంచారు. ఇక పార్టీలో సీనియర్లు అని చెప్పుకోవడానికి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఓ వైపు ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి.


వాళ్ళు రారు :


పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి మెగా కుటుంబం రాదుట. ఈ మాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీగా చెప్పేశారు. ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కోసం ఎవరూ పార్టీలోకి రారని చెప్పారు. వారు తన కుటుంబ సభ్యులు మాత్రమేనని, అంతే తప్ప వారికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కూడా పవన్ పేర్కొన్నారు. నాగబాబు, వరుణ్ తేజ్ విరాళాలు ఇవ్వడాన్ని కూడా ఆయన మామూలు వ్యవహారంగానే చూశారు. పార్టీని అభిమానించి ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని, ఆ విధంగా విరాళాలు వారు కూడా ఇచ్చారు తప్ప అందులో విశేషం ఏదీ లేదని అన్నారు. 


పిలిస్తే రెడీ :


ఇదీ మెగా క్యాంప్ నుంచి వినిపిస్తున్న మాట. బాబాయి కి నేను పిలుపు దూరంలో ఉన్నా అన్నాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. బాబాయ్ తన పార్టీ ప్రచారానికి రమ్మని పిలిస్తే  క్షణం ఆగకుండా వెళ్తాను అని ఓపెన్ గానే చరణ్ చెప్పుకొచ్చారు. అలాగే బన్నీ కానీ, ఇతర మెగా హీరోలు కానీ పవన్ జనసేన పార్టీకి తాము మద్దతుగా ఉంటామని అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఇక నాగబాబు అయితే తమ్ముడికి తాను ఎపుడూ బాసటగా ఉంటానని తరచూ అంటూనే ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి తప్ప అందరూ పవన్ వెంటే ఉన్నారని అర్ధమవుతోంది. 


ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన ఇండైరెక్ట్ మద్దతు ఇస్తారని కూడా టాక్ నడుస్తోంది. మరి ఇంతమంది గ్లామర్ స్టార్లు తన వెనకాల ఉన్నా కూడా పవన్ మాత్రం తమ [పార్టీలోకి  ఎవరూ రారు అంటున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన పరిణామమే. పవన్ పార్టీ రేపటి ఎన్నికల్లో తొలిసారి పోటీ చేయబోతోంది. . అటువంటి పార్టీకి అందరూ తలా ఓ చేయి వేస్తే గెలుపు తీరాలకు చేరుతుందని అంతా అనుకుంటున్న వేళ పవన్ మాత్రం అందుకు భిన్నగా స్పందించడం విశేషం. మరి పవన్ ఆలోచనల మేరకు ఆయన వరకే రాజకీయాలు పరిమితం కావాలని, కుటుంబం వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడకూడదన్న అభిప్రాయం ఉందేమేననిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: