పవన్ కళ్యాన్ తనకు బంగారు బాతైన సినీ రంగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇక్కడ ఆయన తొలుత 2014 ఎన్నికల్లో టిడిపి-బిజేపి సంకీర్ణాన్ని బలపరచి వారిని ప్రశ్నిస్తూ పని చేయిస్తానని అనారు. ఆ విషయంలో ఆయన ఆమూలాగ్రం విఫలమయ్యారు. ఇంతకు ముందు తన సోదరుడు చిరంజీవి  ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేతగా ఆయన సాధించింది ఏమీ లేకపోగా అప్పుడు టిడిపి ద్వేషిగా ప్రవర్తించారు.  2014 లో టిడిపిని సమర్ధించి గెలిపించారు. మద్యలో మళ్లా ద్వేషించారు. ఆతరవాత మళ్ళా దాన్ని ప్రేమిస్తూ వచ్చారు.  మద్యలో గాప్ ఇచ్చారు. ఇప్పుడు టిడిపిని మళ్ళా ప్రేమిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అంతా అయోమయం గందర గోళంగా మారిపోతోంది పవన్ కళ్యాన్ గారి జనసేన పార్టీ. 

what is janasena stand కోసం చిత్ర ఫలితం

జనసేన స్టాండ్ లో ఇంకా స్పష్టత లేదు? జయదేవ్ గల్లా


గురివింద తన కింద నలుపు ఎరగకపోయినా ఈ మహానుభావుడు లోకం నలుపు గురించి అదే పనిగా మాట్లాడుతున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారేలాగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధోరణి మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరిని గందరగోళంలో పడేస్తుంది. అందరిలో ఆయన పట్ల ఆయన పార్టీ పట్ల అనుమానం అంతకంతకూ పెరుగుతోంది. తనపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన విమర్శలకు ధీటుగా బదులివ్వాల్సిన పవన్ కళ్యాన్ అందుకు తేడా  గా చేస్తున్న వ్యాఖ్యలు సందర్భానికి అతకని విధంగా ఉన్నాయని అంటున్నారు శ్రోతలు.

what is janasena stand కోసం చిత్ర ఫలితం

వైఎస్ జగనమోహన రెడ్డికి కేసీఆర్ మద్దతు ఉందని, కేసీఆర్ జగనమోహన రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లుగా పవన్ కళ్యన్ చేస్తున్న ప్రచారం చూస్తే, గురివింద సామెత చటుక్కున గుర్తుకు వస్తుంది.  గతంలో కేసీఆర్ ను, ఆయన తనయ కవితను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టి, 2018లో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనసేన పోటీ చేయవలసిన అవసరం ఎందుకు గుర్తించలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు తనకు ముఖ్యమన్నట్లు మాట్లాడే పవన్ కళ్యాన్ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ, ఎవరికి ఓటు వేయాలి అన్న విషయాన్ని వివరిస్తూ టీఆరెస్ వైపుకు ఆయన పరోక్షంగా మొగ్గిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది.

pawan kalyan janasena images కోసం చిత్ర ఫలితం

గతంలో కేసీఆర్ పై మాటిమాటికి కొదమ సింహంలా దూకిన పవన్ కళ్యాన్ శాసనసభ ఎన్నికల నాటికి కాలుగాలిన పిల్లిలా మారి పోవటం కొందరిని కుపితులను చేసింది. ఆయన అలా చేయటం లోని నేపధ్యానికి గల అసలు కారణం ఏమిటి అనేదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

janasena vs tdp కోసం చిత్ర ఫలితం 

పవన్ కళ్యాన్ ఎవరు? అంటూ అమాయకంగా వెటకారంచేసిన కేసీఆర్ పవన్ కళ్యాన్ కు ఎక్కడో కారంపూసి మంటలు రేపిన వైనం పవన్ కు ఇప్పుడు గుర్తుకు రాకపోవటం కూడా జనాన్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. అసలేమిటీ మనిషి? అనేది ప్రజల్లో పవన్ కున్న అపప్రధ. కొన్నిసార్లు తెలంగాణలో అభివృద్ధి గురించి గొప్పలుకూడా చెప్పారు. మద్యే మద్యే పానీయం సమర్పయామి అన్నట్లు టిడిపిలో కరచాలనం చేస్తుంటారు అప్పుడప్పుడు. ఏపిలో సాధారణ ఎన్నికలు దగ్గరపడే సమయం ముంచుకొస్తున్నవేళ పవన్ ఆయన జనసేన సోది లోకి రాకుండాపోయే ప్రమాదం కనిపిస్తుంది. 

janasena vs tdp కోసం చిత్ర ఫలితం

కొంతకాలం లోకెష్ చంద్రబాబు గురించి చండాలంగా మాట్లాడిన పవన్ ఈ మద్య జగన్ గురించి వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ చూస్తుంటే జనసేన ఈసారి అంటే 2019 లో జరగనున్న ఎన్నికల్లో పోటీ  చేయదేమో అన్న సంధిగ్ధంలో ఉన్నారు చాలమంది ప్రజలు.

 janasena vs YCP కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: