జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఏపి ఇంటెలిజెన్స్ పోలీసుల హడావుడి పెరిగిపోయింది. మామూలుగానే జగన్ ఇంటిముందు ఏపి పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుంది. దానికితోడు తాజాగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ అండ్ కో చర్చలకు వస్తుండటంతో నిఘా పోలీసుల హడావుడి పెరిగిపోయింది.  కెసియార్ చొరవ తీసుకుని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లోకి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే చర్చల కోసమని కొడుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ తో పాటు మరో నలుగురు సీనియర్ నేతలు జగన్ ఇంటికి వస్తున్నారు.

 

ఎలాగూ తన ఇంటికి వస్తున్నారు కాబట్టి కెసియార్ దూతలను భోజనానికి రమ్మని జగన్ ఆహ్వానించారు. దాంతో టిఆర్ఎస్ కు చెందిన మరికొందరు నేతలు కూడా జగన్ ఇంటి దగ్గరకు చేరుకుంటున్నారు. దాంతో జగన్ ఇంటి దగ్గర హడావుడి పెరిగిపోయింది. ఎక్కడైనా హడావుడి పెరిగితే అందులోను రాజకీయ హడావుడి ఉంటుందంటే అక్కడ ఇంటిలిజెన్స్ పోలీసులు వాలిపోతారు కదా ? అలాగే ఈరోజు ఉదయం నుండి ఇంటిలిజెన్స్ పోలీసుల హడావుడి పెరిగిపోతోంది. ఇఫ్పటికే జగన్ ఇంటి దగ్గరకు వచ్చిన టిఆర్ఎస్ నేతలెవరు ? వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు అనే విషయాలను రాబడుతున్నారు.

 

జగన్ ను ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించటమేనా లేకపోతే రాబోయే ఎన్నికల్లో వైసిపికి కెసియార్ తరపున అందనున్న సహాయ సహాకారాల విషయంలో కూడా చర్చలు జరిపేదీ లేంది స్పష్టత లేదు. అందుకనే ఆ విషయాలను రాబట్టేందుకే ఇంటెలిజెన్స్ పోలీసులు నానా అవస్తలు పడుతున్నారు. జగన్ ఇంటిముందు హడావుడిని ఎప్పటికప్పుడు విజయవాడలోని ఇంటిలిజెన్స్ చీఫ్ కార్యాలయానికి పంపుతున్నారు. మొత్తానికి జగన్ తో టిఆర్ఎస్ నేతలు సమావేశం అవుతున్నారంటేనే చంద్రబాబునాయుడలో టెన్షన్ పెరిగిపోతోందన్న విషయం స్పష్టంగా కనబడుతోంది. మరీ ఈ రోజు మొదలయ్యే చర్చల పరంపర ఎక్కడి దాకా వెళుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: