పాదయాత్ర వల్లో తగిలిన ఎదురు దెబ్బల వల్లో కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిలో మెచ్యూరిటీ లెవల్స్ బాగా పెరిగినట్లే కనబడుతోంది. ఫెడరల్ ఫ్రంట్ లోకి రావాలంటూ కెసియార్ పంపిన ఆఫర్ విషయంలో కెటియార్ తో చర్చల్లో స్పష్టమవుతోంది.  దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు కలవాల్సిన అవసరం గురించి చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడారు. రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుకోవాలంటే ఆయా రాష్ట్రాల్లోని ఎంపిల బలం సరిపోదు. ప్రత్యేకహోదాపై యూపిఏ ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీకే ఎన్డీఏ ప్రభుత్వంలో దిక్కు లేకపోయింది. రాష్ట్రాల హక్కులు కాపాడుకోవాలంటే, రాష్ట్రాలు తమ హక్కులను సాధించుకోవాలంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కెసియార్ చొరవ స్వాగతించాల్సిందే అని చెప్పారు. కెసియార్ చేసిన ప్రయత్నాలను హర్షించతగ్గదే అన్నారు.

 

కెటియార్ భేటీ గురించి తనతో కెసియార్ ఫోన్ లో చెప్పిన విషయాన్ని జగన్ వెల్లడించారు. రెండుసార్లు తనతో కెసియార్ మాట్లాడిన తర్వాతే ఈరోజు తారక్ తన బృందంతో వచ్చి సమావేశం అయినట్లు స్పష్టం చేశారు. తొందరలో స్వయంగా కెసియారే వచ్చి తనతో మాట్లాడుతానని చెప్పారు. కెటియార్ తో తన భేటీ కేవలం లాంఛనమేనన్నట్లు జగన్ చెప్పారు. ఇంకా చాలాసార్లే సమావేశాలు జరపాల్సుందని జగన్ అభిప్రాయపడ్డారు. కెటియార్ బృందంతో తాను జరిపిన చర్చలను వైసిపి నేతలతో కూడా చర్చిస్తానని జగన్ తెలిపారు.

 

మొత్తం మీద ఫెడరల్ ఫ్రంట్ లో చేరే విషయమై కెసియార్ ఇచ్చిన ఆఫర్ పై జగన్ జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లు అర్ధమవుతోంది. భేటీ తర్వాత జగన్, కెటియార్ మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా జగన్ ఎక్కడా వైసిపి ఫెడరల్ ఫ్రంట్ లో చేరుతుందని స్పష్టంగా ప్రకటించలేదు. కెటియార్ చర్చల సారాంశాన్ని తమ పార్టీలోని నేతలతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మాత్రమే చెప్పారు. అదే సమయంలో కెసియార్ చేస్తున్న కృషిని ఆహ్వానించతగ్గదేనని,  హర్షణీయమని చెప్పటం గమనార్హం. అంటే రేపటి ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా కెసియార్ తీసుకోబోయే స్టాండ్ ఎలాగుంటుందో సందిగ్దతలోనే ఉంది. అందుకే జగన్ కూడా కెసియార్ ఆఫర్ పై జాగ్రత్తగా బ్యాలెన్సుడుగా మాట్లాడినట్లే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: