ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పొలిటికల్ సర్కిల్లో టెన్షన్ పెరిగిపోతోంది. టీడీపీ, వైసీపీ మధ్య ఎలక్షన్ వార్ ఫుల్ టైట్ కావడంతో ఎవరు గెలుస్తారన్నది ఊహించలేకుండా ఉంది. ఈ సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌ ఏపీ రాజకీయాలపై సర్వే చేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతుండటం కలకలం సృష్టిస్తోంది.



ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని.. 120 వరకూ సీట్లు గెలుచుకుంటుందని కె. నాగేశ్వర్ సర్వే లో తేలినట్టు వాట్సప్, ఫేస్ బుక్‌లలో మెస్సేజులు సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌కు ఉన్న క్రెడిబిలిటీ కారణంగా ఇవి నిజమేనని చాలామంది నమ్ముతూ ఫార్వార్డు చేస్తున్నారు. ప్రత్యేకించి వైసీపీ నాయకులు వీటిని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు.

Related image


అసలు ఇంతకూ కె.నాగేశ్వర్ నిజంగానే సర్వే చేశారా.. ఆ వార్తలు నిజమేనా.. అని పరిశీలిస్తే ఇదంతా అబద్దమే అంటున్నారు కె. నాగేశ్వర్. సోషల్ మీడియా ప్రచారంపై ఆయన ఓ ఛానల్ల్లో స్పందిస్తూ.. తన పేరుతో కొందరు ఇలాంటి మెస్సేజులు స్ప్రెడ్ చేస్తున్నారని.. ఆయన వాపోయారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల సమయంలో తాను చెప్పిన అంచనాలు కరెక్ట్ కావడంతో తన పేరుతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

Image result for k nageswar survey

ఈ ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని కె. నాగేశ్వర్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తానే స్వయంగా సర్వే చేయించి ఉంటే.. తన ఫేస్‌బుక్‌లోనో.. యూ ట్యూబ్‌లోనో ప్రకటిస్తాను తప్ప.. వేరే మీడియాలో ఎందుకు ప్రకటిస్తానని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రచారాన్ని మొదట ఓ వెబ్‌సైట్ ప్రచురించిందని.. ఆ తర్వాత ఆ వెబ్‌సైట్ క్షమాపణ కూడా చెప్పిందని నాగేశ్వర్ గుర్తు చేశారు. సో.. ఈ ప్రచారమంతా అబద్దమన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: