సంక్రాంతి పండుగ నాడు వైస్సార్సీపీ అధక్షుడు జగన్ తో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడం రాజకీయాల్లో ఎక్కడ లేని సంచలనాన్ని క్రియేట్ చేసింది. మీడియా గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు..  ఒకటే హడావుడి. అయితే ఇప్పటికే టీడీపీ పైన ప్రజలు తీవ్ర వ్యతిరేకత తో ఉన్నారని  పలు సర్వేలు ఘంటా పథంగా చెబుతున్నాయి. తెలంగాణ లో భారీ విజయాన్ని కేసీఆర్ నమోదు చేసి మంచి ఇమేజ్ సంపాదించాడు. అయితే ఇప్పడూ ఈ రెండు పార్టీలు కలిస్తే వైస్సార్సీపీ కి ఇంకా మైలేజ్ రావొచ్చని టీడీపీ భయపడుతుంది . అదే జరిగి టీడీపీ ఓటమి పాలైతే పరిస్థితి ఏంటని కొంత మంది నాయకులు ఆందోళన చెందుతున్నారు. 


ఆంధ్ర్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు సిద్దంగా ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ సమయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ - తెలంగాణ రాష్ట్ర సమితి అగ్ర నాయకులు కలవడం తెలుగుదేశం పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. దీంతో చంద్రబాబు నాయుడిని దెబ్బ తీసేందుకే ఈ పార్టీల నాయకులు కలిసారంటూ తెలుగుదేశం నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. 

Image result for chandra babu

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వీరి కలయిక తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల పాలు చేయడమేనని ఆ పార్టీ నాయకుల ప్రకటనల సారాంశం. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు చూపించిన అత్యుత్సాహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ సమయంలోనే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే వైఎస్. జగన్ మోహన రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు సమావేశం అయ్యారని తెలుగుదేశం నాయకుల ఆందోళన. ఈ కలయికతో తెలుగుదేశం పార్టీ నాయకులకు గుండెల్లో గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: