బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఘోర అవమానాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. బ్రెగ్జిట్‌పై ఆమె ప్రతిపాదించిన ఒప్పంద పత్రం పార్లమెంట్‌లో వీగిపోయింది. థెరెసా సొంత పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులే ఆమె ప్రతిపాదించిన ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒప్పందం ఆమోదం పొందడానికి 230 ఓట్లు కావాల్సి ఉండగా, 432 ఓట్లు వ్యతిరేకంగా 202 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. దీంతో థెరిస్సా మే ఓడిపోయారు. ఐరోపా సమాఖ్యతో చేసుకున్న బ్రెగ్జిట్‌ ఒప్పందంపై పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరిగింది. 

Prime-Minist1

కాగా థెరిస్సా మే ప్రభుత్వంపై ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే బ్రెగ్జిట్లో ఓటమిపాలై, అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్న బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ థెరీసా మే, అనూహ్య విజయం సాధించారు. బుధవారం సాయంత్రం ఓటింగ్ జరుగగా, ఆమెపై తమకు నమ్మకముందని 325 మంది చెప్పారు.వ్యతిరేకంగా 302 ఓట్లు వచ్చాయి.


దీంతో ప్రస్తుతానికి ఆమె పదవికి ఇక ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అయితే ఇప్పటి వరకు ఓ బిల్ పై ఓటింగ్  జరిగి, ఆ బిల్లు ఆమోదం పొందకుంటే, మరుసటి రోజు జరిగే విశ్వాస పరీక్షలో ఓటమిపాలై గద్దె దిగుతుంటారు. కానీ, చరిత్రను తిరగరాసిన థెరీసా మే 432-202 తేడాతో బ్రెగ్జిట్ లో ఓటమిపాలైనా, విశ్వాస పరీక్షను మాత్రం గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాల్సిందేనని అత్యధిక ప్రజలు కోరుకున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: