ఏపీలో మెల్లగా రాజకీయాలు రూపు మార్చుకుంటున్నాయి. పేరుకు దశాబ్దాల చరిత్ర ఉన్నా కూడా కామ్రేడ్స్ పొత్తుల కోసం పాట్లు పడుతూండడం ప్రతి ఎన్నికల్లోనూ చూస్తుంటాం. ఇపుడు పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు కుదురుచుకుంటున్న కామ్రేడ్స్ జాతీయ రాజకీయాలతో పాటు, ఏపీ రాజకీయాల్లోనూ గందరగోళం తోనే ఉన్నారని అర్ధమవుతోంది.


బీజేపీయే శత్రువు :


కామ్రేడ్స్ కి కాలాలు ఎన్ని మారినా బీజేపీ ఒక్కటే శత్రువు. ఎందుకంటే అది మతతత్వ పార్టీ అంటారు. మరి ఆ పార్టీతో కలసిన పార్టీలు మాత్రం వారికి ఎపుడూ ముద్దే. ఇక దేశంలో అనేక మతం పేరిట పార్టీలు ఉన్నాయి. అవి ఓపెన్ గానే ఉంటూ వస్తున్నాయి. వాటితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా కామ్రెడ్స్ కి ఏం అనిపించదు. ఇక జాతీయ ష్తాయిలో బలహీనమైన స్థితిలో ఉన్న కామ్రేడ్స్ తమకు కాంగ్రెస్, బీజేపీ రెండూ శత్రువులు అనడం లేదు. బీజేపీని నిలువరించడం కోసం కాంగ్రెస్ తో చేతులు ఎన్నో మార్లు కలిపాయి. ఇపుడు కూదా కలిపేందుకు సిధ్ధంగా ఉన్నాయి.  అందుకే కేసీయార్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ విషయంలో బాబు గొంతుకనే వినిపిస్తున్నాయి.


ఏపీలో స్టాండ్ ఏంటి :


ఇక ఏపీలో తీసుకుంటే కామ్రెడ్స్ టీడీపీకి వ్యతిరేకం అంటున్నాయి. కానీ వారి వైఖరి, మారుతున్న గొంతుక చూస్తూంటే చంద్రబాబు బాటలోనే పోతున్నట్లుగా అర్ధమవుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ కూటమికి బాబు మద్దతు ఇస్తున్నారు. అదే కూటమికి కామ్రెడ్స్ కూడా మద్దతు ఇస్తోంది. అంటే ఇవాల ఏపీలో విడిగా పోటీ చేసిన రేపటికైనా కలుస్తామని చెప్పకనే చెబుతున్నారన్న మాట. నిజానికి కామ్రెడ్స్ కాంగ్రెస్, బీజేపీ రెండిటికీ సమదూరం పాటించినట్లైతే ఫెడరల్ ఫ్రంట్ కే మద్దతుగా ఉండాలి మరి దాన్ని విమర్శించడం ద్వారా కామ్రెడ్స్ కాలాలు మారినా తాము మారలేదని చెప్పకనే చెబుతున్నారేమో



మరింత సమాచారం తెలుసుకోండి: