ఎవరు ఏం మాట్లాడాలో? ఎవ్సరు ఏం మాట్లాడకూడదో చెపుతున్నారు టిడిపి నాయకులు. ప్రజాస్వామ్యంలో  ఇలా జరగటం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ప్రాంతానికి వచ్చి రాజకీయాలు మాట్లాడవద్దని ఆంధ్రప్రదేశ్‌ లోని కొందరు తెదేపా శాసనసభ్యులు ఆదేశాల రూపంలో చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. 
talasani in bhimavaram కోసం చిత్ర ఫలితం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మొన్న మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ సంస్కృతీ సాంప్రదాయాలను అనుసరించి ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ వేడుకలుగా జరుగుతాయని, ఇక్కడి ఆతిథ్యం ఎంతో గొప్పగా అనిర్వచనీయంగా ఉంటుందన్నారు. అందుకే ప్రతీ సంవత్సరం ఈ పండుగకు ఇక్కడికి వచ్చి మిత్రులతో గదపటం అలవాతైందని అన్నారు తలసాని. 


నడుస్తున్నది ఎన్నికల సమయం కావడంతో తెలంగాణ నుంచి నేను ఎందుకు వచ్చానో? ఇక్కడ ఏం చేస్తున్నానో? అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాపై ఇంటెలిజెన్స్ నిఘా ఉంచడం చూస్తే చాలా హాస్యాస్పధంగా ఉంది. అయినా వారికి భయపడి నేను మాత్రం వెనుకాడేది లేనని అన్నారు. తాను ప్రస్తుతం వచ్చింది ఖచ్చితంగా రాజకీయాలు చేయడానికేనని అందులో అనుమానానికి తావులేదని స్పష్టం చేశారు. 


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు తెలంగాణా ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కలవకుంట్ల చంద్ర శేఖరరావు వాగ్ధానం చేసిన రిటర్న్-గిఫ్ట్ భద్రం గానే సిద్ధం చేశామన్నారు. అది ఎలా ఉంటుందో? ఏ మేర ఉంటుందో? అంతా గోప్యం అన్నారు.  ఆంధ్రప్రదేశ్ లోని ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విధంగా సంపూర్ణ మద్దతు తాము ఇవ్వనున్నామన్నారు. అనంతరం జిల్లా లోని పలు ప్రాంతాలకు వెళ్లి సంక్రాంతి వేడుకలైన కోడిపందేలు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు సామాజిక వర్గాలకు చెందిన వారితో సమీక్షలకు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. 
సంబంధిత చిత్రం
ఇక ఎప్పటిలాగానే ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇద్దరికీ ఈ తలసాని శ్రీనివాస యాదవ్‌ ఏజెంట్‌ గా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ విమర్శించారు. గుంటూరు జిల్లాలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్‌ తొలగిస్తే నోరెత్తని తలసాని శ్రీనివాస యాదవ్‌ ఇక్కడకు వచ్చి కారు కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. అయిదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ దొరలకు జగన్మోహనరెడ్డికి  తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. 
bonaboyina srinivas yadav Vs Talasani srinivas yadav కోసం చిత్ర ఫలితం
ఇది పరిశీలిస్తే యధాతథంగా ఒక యాదవ్ ని మరో యాదవ్ ను విమర్శించి తిట్టించే చంద్రబాబు విధానం టిడిపి రాజకీయంలో ఎలాంటి మార్పులేదని ఆ సమావేశలోనె చాలామంది అనటం ప్రజలెంతగా తమ ఆధునిక తెలుగుదేశం రాజకీయ ఙ్జాన్ని వంటబట్తించుకున్నారో అర్ధమౌతుందని విశ్లేషకులు అంటున్నారు.  

Whoa are the modi agents ln AP CM chandrababu view కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: