తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం (జనవరి 17) కొలువుదీరనుంది. గురువారం ప్రారంభమయ్యే సమావేశాలు జనవరి 20 వరకు కొనసాగనున్నాయి. ఎంఐఎం పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అహ్మద్‌ ఖాన్‌తో బుధవారం సాయంత్రం  5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.   గురువారం ఉదయం 11.30 గంటలకు ముంతాజ్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశమవుతుంది.

Mumtaz Ahmed Khan Taken Oath As Protem Speaker For Telangana Assembly - Sakshi

అంతకుముందు ఉదయం 11 గంటలకు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అమరవీరులకు నివాళులు అర్పించారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు.   అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణం చేయిస్తారు. 

Image result for telangana assembly

18న స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు... ఒకే నామినేషన్ దాఖలైతే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.  19వ తేదీన తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, కౌన్సిల్‌లో వేర్వేరుగా చర్చ జరుగుతుంది. ఈ చర్చను అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రారంభిస్తారు. ప్రశాంత్‌రెడ్డి తదితరులు మాట్లాడుతారని తెలిసింది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ, కౌన్సిల్ ధనవ్యాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నాయి. 

newly formed telangana assembly to meet from today

Highlights

  • 17 నుంచి 20 వరకు సమావేశాలు
  • 19న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నరు ప్రసంగం
  • 20 గవర్నరు ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం (జనవరి 17) కొలువుదీరనుంది. గురువారం ప్రారంభమయ్యే సమావేశాలు జనవరి 20 వరకు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం బుధవారం రాజ్‌భవన్‌లో సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: