ప్రపంచంలో చాలా మంది తమ ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకోవడం చూస్తుంటాం.  ఎక్కువగా శునకాలు, పిల్లులు, కుందేళ్లను  పెంచుకుంటారు.  కొంత మంది పక్షులను ఎంతో ప్రేమతో పెంచుకుంటారు.  కొంతమంది క్రూర జంతువులను, విష సర్పాల్ని కూడా పెంచుకుంటుంటారు. ఇటువంటివి చూస్తే  ఏమీ చేయావా..ఒకవేళ చేస్తే..పరిస్థితి ఏంటి అనే భయం వేస్తుంది. అలా వారు ఎంతో ముద్దుకు పెంచుకున్నవి వారి భరతం పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
Related image
తాజాగా ఓ మహిళ మొసలిని పెంచి దానికే ఆహారంగా మారిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని ఉత్తర సులావెసీలోని మినాహాసాలో సైంటిస్ట్  మౌల్డ్ తన ఇంటి ముందు ఓ మడుగులాంటి వాటర్ టమ్ ఏర్పాటు చేసి దాంట్లో 14 అగడుగుల ఓ మొసలిని పెంచుతోంది.  తానే స్వయంగా దానికి ఫుడ్ పెడుతుంటుంది. దాంతో ఆటలు కూడా ఆడుకుంటు చాలా ముద్దు చేసేది.

ఓ రోజున యజమానురాలిపై దాడి చేసి క్రూరంగా చంపేసింది. ముసలికి ఫుడ్ అందించడానికి వెళ్లిన ఆమె చేయిని తినేసింది..తర్వాత పొట్టభాగం కూడా నమిలేసింది.. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాం తయారైంది. మరుసటి రోజు ఉదయం ఆమె ఇంటికి వచ్చిన తోటి ఉద్యోగులకు దారుణంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన సైంటిస్ట్ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. వైద్యులు, ఆర్మీ, పోలీసుల సాయంతో మొసలిని శాస్త్రవేత్త ఇంటి నుంచి జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.మహిళా శాస్త్రవేత్త మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: