సినీ నటుడు శివాజీ అదే 'గరుడ' శివాజీ ఆ మధ్య జగన్ మీద దాడి జరగనున్నదని బ్రహ్మం గారు కాలజ్ఞానం చదివినట్లు చదివి వినిపించాడు. అయితే జగన్ మీద నిజంగా దాడి జరగడం తో ఇప్పడూ శివాజీ మెడకు కూడా చుట్టుకునే పరిస్థితి వచ్చిందని చెప్పాలి. తానేదో బ్రహ్మం గారు లా ఫోజ్ కొట్టిన శివాజీ ఇప్పడూ అధికారుల ముందు ఏం చెప్పబోతాడని అందరూ అనుకుంటున్నారు. ఇటీవలే జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు జగన్ పై దాడికి గల కారణాలు.. వెనుక ఎవరున్నారనే దానిపై గంటలు గంటలు విచారణ కొనసాగిస్తున్నారు.

Image result for sivaji telugu actor garuda

ఇక నిందితుడు శ్రీనివాస్ జగన్ పై దాడి చేయడానికి ముందు ఆయన పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లోకి కోడికత్తిని ఎలా తీసుకొచ్చాడు. ఎక్కడ దాచాడు.? ఎవరు సహకరించారనే దానిపై కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కోవలోనే ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ యజమాని అయిన హర్షకుమార్ ను కూడా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్ మెంట్లను రికార్డు చేశారు.

Image result for sivaji telugu actor garuda

ఇక ఈ కుట్ర గురించి ముందే తనకు తెలుసు అంటూ ‘ఆపరేషన్ గరుడ’ పేరు హల్ చల్ చేసిన సినీ నటుడు రాజకీయ నాయకుడు శివాజీ ని కూడా విచారించడానికి ఎన్ఐఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడిపై దాడి చేయించి.. ఆంధ్రప్రదేశ్ ను అల్లకల్లోలం చేయబోతున్నారని.. సీఎం చంద్రబాబును గద్దెదించడమే ధ్యేయంగా ఈ కుట్రకు తెరతీశారని శివాజీ అప్పట్లో సంచలన విషయాలు చెప్పాడు. సీఎం చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ నిజాలు ఎలా తెలుసు.? ఎవరు చెప్పారనే దానిపై పోలీసులు ఆరాతీయనున్నారు. శివాజీ వ్యాఖ్యలు అచ్చుగుద్దినట్టే తదనంతరం అలానే సంఘటనలు చోటుచేసుకోవడంతో ఈ కేసులో ఆయన సాక్ష్యం కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: