కోడి-కత్తి కేసు అంటూ సాధారణ మానవత్వం మరచి అంతకు మించి తనున్న ఉన్నత స్థానం మరచి మరీ లేకిగా చంద్రబాబు వెటకారం చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి పై హత్యాయత్నం కేసు అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కాదు మొత్తం టిడిపి మెడకే చుట్టుకొంటున్నట్లుగా ఉంది. ఆ కేసు విషయంలో ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ సైతం మాట్లాడిన తీరు ఇవన్నీ ఎన్ ఐ ఏ విచారణలో భాగం కాబోతున్నాయా? ఇది నేటి ఏపిలో బర్నింగ్ టాపిక్ - అయింది 


ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి పై విశాఖ ఎయిర్‌-పోర్టులో జరిగిన హత్యాయత్నం వెనుక చంద్రబాబు హస్త ముందని వైసీపీ నేత షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ ఆరోపించారు. హత్యాయత్నం జరిగినప్పటి నుంచి చంద్రబాబు ప్రవర్తన, డీజీపీ స్టేట్‌మెంట్‌, అనేక అనుమానా లకు తావిచ్చాయన్నారు. అందుకే కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాటం చేశామని చెప్పారు. ఎన్‌ఐఏ విచారణ అంటే చంద్రబాబుకు దడ పుడుతుందో? ఎందుకు జంకుతున్నారో? చెప్పాలని ప్రశ్నించారు.

harshavardhan choudari కోసం చిత్ర ఫలితం

సోమవారం హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హత్యాయత్నం జరిగిన గంట లోపే డీజీపీ మీడియా ముందుకు వచ్చి నిందితుడు ఎస్సీ అని, వైసీపీ అభిమాని అని, చిన్నకత్తి అంటూ ఇష్టారీతిన తనకు తోచినట్లు మాట్లాడారని మండిపడ్డారు. చంద్రబాబు సైతం కోడి - కత్తి అంటూ అవహేళన చేశారని గుర్తు చేశారు. వీరిద్దరూ ఒకరి వెంట ఒకరు వెనువెంటనే స్పందించిన తీరు, ప్రవర్తనతో తమ అనుమానం పూర్తిగా బలపడిందన్నారు. వైఎస్‌ జగన్‌ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, ఆపరేషన్‌ గరుడ పేరుతో హత్యాయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రజా నాయకుడైన వైఎస్‌ జగన్‌ను అంతం చేయాలని కుట్ర పన్నారని అన్నారు. నిందితుడు శ్రీనివాసరావు పనిచేసే ఫ్యూజన్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి సీఎం చంద్ర బాబు, మంత్రి లోకేశ్‌లకు అతి దగ్గరి అనుచరుడని చెప్పారు. విశాఖ పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో జగన్‌పై జరిగింది హత్యాయత్నమని స్పష్టంగా చెప్పారన్నారు. అలాటప్పుడు చంద్రబాబు డిజిపి ఇద్దరు ఇంత నిర్లక్ష్యం మాట్లాడటం తగునా? చట్టాలు చంద్రబాబుకు వర్తించవా? అని ప్రశ్నించారు.

harshavardhan choudari కోసం చిత్ర ఫలితం

లైన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ చంద్రబాబు నోటి నుండి వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగు తుందనే నమ్మకం ఎలా ఉంటుంది? అని ఇక్బాల్‌ ప్రశ్నించారు. అందుకే కోర్టుకు వెళ్లి థర్డ్‌ పార్టీ విచారణ చేయించాలని కోరామన్నారు. చంద్రబాబు పెదరాయుడు సినిమాలో విలన్‌ లా చట్టాలు తనకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని ఇక్బాల్‌ మండిపడ్డారు.నార్త్‌ కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ జొంగ్‌ ఉన్‌ లా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. కుట్రలు, కుతంత్రాలు చేసి ఏమీ ఎరగనట్లు అమాయకంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లిందన్నారు. టీడీపీ పచ్చ కామెర్ల పార్టీ అని దుయ్యబట్టారు.


అక్టోబర్‌లో ఘటన జరిగితే దాన్ని జనవరి వరకు చంద్రబాబు ప్రభుత్వం సాగదీసిందని మండి పడ్డారు. ఈ కేసులో చంద్రబాబు కుట్ర లేకపోతే కేసు ఎప్పుడో ఒక దిశదశ సంతరించు కొనేదని అన్నారు. న్యాయస్థానం ఆదేశాలు వలననే ఎన్‌ఐఏ విచారణ ప్రారంభమైనదని , దాన్ని కూడా జరగకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత చిత్రం

ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసిన దరిమిలా విచారణలో పరిశీలనలో ఏ చిన్న లూప్-హోల్ దొరికినా వదలకుండా పూర్తి సమగ్ర విచారణ జరపాలని అధికారులు నిర్ణయించారు. నిందితుడు శ్రీనివాసరావును కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు జగన్ పై దాడికి గల కారణాలు, దాని వెనుక ఎవరున్నారు అనే దానిపై గంటలు గంటలు విచారణ కొనసాగిస్తున్నారు. పాత్రధారి శ్రీనివాసరావు అయితే నేపధ్యంలో అంచెలంచలుగా ఉన్న సూత్ర దారుల ఆచూకి తీసే పనిలో ఎన్ ఐఏ దర్యాప్తు కొనసాగుతుందని తెలుస్తుంది.


ఇక నిందితుడు శ్రీనివాస్ జగన్ పై దాడి చేయడానికి ముందు ఆయన పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లోకి కోడికత్తి ని ఎలా తీసుకొచ్చాడు? ఎప్పుడు తీసుకొచ్చాడు? టీసుకొచ్చిన తరవాత ఇంతకాలం ఎక్కడ దాచాడు.? అందుకు ఎవరెవరు సహకరించారనే దానిపై కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ మార్గంలోనే ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ యజమాని అయిన హర్షకుమార్ ను కూడా ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు.

harshavardhan choudari కోసం చిత్ర ఫలితం

ఇక ఈ కుట్ర గురించి ముందే తనకు తెలుసు అంటూ ‘ఆపరేషన్ గరుడ’ ఇంకా కొన్ని పేర్లతో కొన్ని టివి చాన్ల్స్, పత్రికలలో హోరెత్తి హల్ చల్ చేసిన సినీనటుడు రాజకీయ నాయకుడు శివాజీ ని కూడా విచారించడానికి ఎన్ఐఏ అధికారులు రంగం సిద్ధం చేస్తుకున్నట్లు సమాచారం. ఏపీ ప్రతిపక్ష నాయకుడిపై దాడి చేయించి, ఆంధ్రప్రదేశ్ ను అల్లకల్లోలం చేయబోతున్నారని, సీఎం చంద్ర బాబును గద్దెదించడమే ధ్యేయంగా ఈ కుట్ర కు తెరతీశారని శొంఠినేని శివాజీ అనే హాస్య నటుడు అప్పట్లో చాలా సంచలనమే లేపిన విషయం రాష్ట్ర ప్రజలకు కరతలామలకం. అంతే కాదు ఆయన ఈ కుట్రని ఆసరా చేసుకొని ముఖ్యమంత్రికి ప్రధాన ఆసరాగా నిలిచారు.

sivaji operation garuda కోసం చిత్ర ఫలితం

ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈ నిజాలు ఎలా తెలుసు? ఎవరు ఆయనకు చెప్పారు? ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాకి అపకారం తలపెట్టిన ఆకేసు పూర్వాపరాల తేనె తెట్టెను విదిల్చివేసి కేసు నిగ్గు తేల్చాల్సిన ముఖ్యమంత్రితో కూడిన రాష్ట్ర పాలన నిద్రమత్తులో ఎందుకు జోగుతూ ఉండిపోయింది అనే దానిపై ఎన్ ఐ ఏ విభాగం ఆరాతీయనున్నారు. శివాజీ చేసిన వ్యాఖ్యలు నూరు శాతం అలానే సంఘటనల పరంపర చోటుచేసుకోవడంతో ఈ కేసులో ఆయనే ప్రధాన సాక్షిగా విచారణలో కూడా కీలకంగా మారారని అంటున్నారు.


ఇలా అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఎన్ ఐఏ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి వెనుక గల సూత్రధారు లను పట్టుకునే ప్రయత్నంలో బిజీగా ముందుకుసాగుతున్న తరుణంలో ఎన్ ఆఇ ఏ కి రాష్ట్ర సిట్ పోలీసులు విచారణకు చెందిన వివరాలను అందివ్వకపోవటం అనుమానాస్పదం అవుతుంది. ఇందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేదని అంటున్నారు ఏపి సిట్ పోలీసులు.

sivaji operation garuda కోసం చిత్ర ఫలితం

దానికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఎన్ ఐ ఏ విచారణకు అంగీకరించకపోవటంలో ఏ దో కుట్రదాగి ఉందని వైసిపి నేతలే కాదు ఈ సమస్తం సినిమాలా చూస్తున్న ప్రజలు సైతం ముఖ్యమంత్రి వైపు, డిజిపి వైపు అనుమానాస్పదంగానే చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: