జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం ఘటనలో అందరూ అనుకున్నట్లే తెలుగుదేశంపార్టీ సహాయ నిరకారణ చేస్తోంది. హత్యాయత్నం కేసును విచారిస్తున్న ఎన్ఐఏ దర్యాప్తును వ్యతిరేకించటం, విచారణకు సాక్ష్యులను గౌర్హాజరు చేయించటమనే రెండంచెల వ్యూహంతో ముందుకు పోతోంది. సరే ఇదంతా చంద్రబాబునాయుడుకి తెలీకుండానే జరుగుతోందని ఎవరూ అనుకోవటం లేదు. దర్యాప్తు సక్రమంగా జరిగితే, విచారణకు ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నేతలు హాజరైతే బయటపడేది చంద్రబాబు బండారమే అంటున్న వైసిపి ఆరోపణలే నిజాలవుతాయేమో ? అందుకనే నోటీసులందుకున్న టిడిపి నేత హర్షవర్ధన్ చౌదరి అడ్రస్ లేకుండా పోయారు. గరుడపురాణం చెప్పిన సినీనటుడు శివాజి కూడా హాజరయ్యేది అనుమానమే అంటున్నారు.

 

సరే వాళ్ళ సంగతి పక్కనపెడితే ప్రభుత్వ వైఖరే విచిత్రంగా ఉంది. హత్యాయత్నం కేసులో విచారణను ఎన్ఐఏ మొదలుపెట్టింది హై కోర్టు ఆదేశాలతోనే. ఎన్ఐఏ విచారణకు స్ధానిక పోలీసులు ఏమాత్రం సహకరించటం లేదు. ఎన్ఐఏ విచారణకు స్ధానిక పోలీసులు సహకరించటం లేదంటే ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండా సాధ్యమేనా ? హత్యాయత్నం కేసు తాలూకు ఫైళ్ళన్నింటినీ ఎన్ఐఏకి అప్పగించాలని కోర్టు ఆదేశించిన పోలీసులు పట్టించు కోలేదంటే విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. అదే విషయాన్ని ఎన్ఐఏ కోర్టుకు చెప్పిన పోలీసులు ఏమాత్రం భయపడటం లేదు. పైగా ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకూ రికార్డులు ఇచ్చేది లేదని ఎన్ఐఏకి చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.

 

ఎన్ఐఏ విచారణపై చంద్రబాబును కలసి డిజిపి ఆర్పీ ఠాకూర్ కలిసి వివరించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం థిక్కార స్వరం ఎక్కువైంది. ఎన్ఐఏ విచారణను హై కోర్టులో చాలెంజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం విచిత్రంగా ఉంది. కోర్టులో కేసు విచారణపై అంతిమ నిర్ణయం వచ్చేంత వరకూ ఎన్ఐఏకి ఎటువంటి ఫైళ్ళు ఇవ్వకూడదని చంద్రబాబు స్ధాయిలోనే నిర్ణయం తీసుకున్నారంటే ఎన్ఐఏ దర్యాప్తు అంటే ఎంతగా భయపడుతున్నారో అర్దమైపోతోంది. నిజంగానే ఎన్ఐఏ దర్యాప్తు సాఫీగా సాగిపోతే టిడిపిలోని కీలక వ్యక్తులు చాలామంది తగులుకుంటారు. అందుకనే ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తూ విచారణ ముందుకు సాగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, విచారణకు అడ్డంకులు సృష్టించేందుకు చంద్రబాబు అండ్ కో అడ్డంకులు సృష్టిస్తుందని అందరూ ఊహించిందే. కాకపోతే ప్రభుత్వం అడ్డంకులను ఎన్ఐఏ ఏ విధంగా అధిగమించి ముందుకు సాగుతుందన్నదే ప్రధానం.


మరింత సమాచారం తెలుసుకోండి: