తెలుగు ప్రజలకు గుండెల్లో  మంచి నటుడిగా..రాజకీయ నాయకుడిగా చెరగని ముద్ర వేశారు నందమూరి తారక రామారావు. ఇండస్ట్రీలో ఆయన్ని ఎన్టీఆర్ అని...రాజకీయాల్లోకి వచ్చాక అన్నా అని పిలిచారు.  ఎన్టీఆర్ జీవితం పై క్రిష్ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు.  ఎన్టీఆర్ నట జీవితాన్ని మొదటి భాగం అయిన ఎన్టీఆర్ కథానాయకుడు లో ఆవిష్కరించారు. 

ఇక ఎన్టీఆర్ రాజకీయ కోణాన్ని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రంలో చూపించబోతున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉండగా ఆయన లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.  నేడు ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు.  టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆరాధ్యుడేనని ఆయన భార్య లక్ష్మీపార్వతి అన్నారు. 
Related image
కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదనీ, ఘోషిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను చంపినవాళ్లు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. తన గుండెల్లో మంట ఇంకా చల్లారలేదనీ, కన్నీరు ఆరలేదని లక్ష్మీపార్వతి అన్నారు.  ఒకప్పుడు ఎన్టీఆర్ మహిళలకు ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారని..కానీ ఇప్పుడు టీడీపి మాత్రం మహిళలను అవమానిస్తోందని దుయ్యబట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: