అలాగే ఉంది చూస్తుంటే. ఈనెల 23వ తేదీ నుండి 28 వరకూ చంద్రబాబునాయుడు, నారా లోకేష్ అండ్ కో దావోస్ ట్రిప్పుకు బయలుదేరి వెళ్ళాలి. కానీ హఠాత్తుగా చంద్రబాబు మాత్రం తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మామూలుగా అయితే చంద్రబాబు తన విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకునేందుకు ఇష్టపడరు. కానీ ఇపుడు మాత్రం వేరే దారిలేక ట్రిప్పును రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకీ విదేశీయానాన్ని రద్దు చేసుకునేంత అసవరం ఏమొచ్చింది చంద్రబాబుకు ?

 

టిడిపి వర్గాల సమాచారం ప్రకారం ఎన్ఐఏ దెబ్బకే చంద్రబాబు తన విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారట. జగన్మోహన్ రెడ్డి  హత్యాయత్నం కేసును ఎన్ఐఏ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆ కేసు విచారణ విషయంపై ఇటు ఎన్ఐఏకి అటు రాష్ట్రప్రభుత్వానికి పెద్ద వివాదమే నడుస్తోంది. ఘటన జరగ్గానే బాధ్యతను కేంద్రంపై నెట్టేసిన చంద్రబాబు ఎన్ఐఏ విచారణకు రంగంలోకి దిగగానే విచారణను అడ్డుకుంటున్నారు. కేంద్రంపై కాలు దువ్వటంలో భాగంగానే ఎన్ఐఏ విచారణకు ఏమాత్రం సహకరించటం లేదు. పైగా ఎన్ఐఏ విచారణ సవాలు చేస్తే హైకోర్టులో పిటీషన్ వేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించటం గమనార్హం.

 

ఇదంతా ఒక ఎత్తైతే హత్యాయత్నం ఘటనలో వైసిపి అనుమానిస్తున్న ఎయిర్ పోర్టు క్యాంటిన్ యజమాని, టిడిపి నేత హర్షవర్దన్ చౌదరి ఎన్ఐఏ విచారణకు గైర్హాజరయ్యారు. విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఐఏ నోటీసు ఇచ్చినా అడ్రస్ లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఎన్ఐఏ విచారణకు చౌదరి హాజరైతే టిడిపిలో కీలక వ్యక్తుల కూసాలు కదలటం ఖాయమనే అర్దమవుతోంది. అందుకనే మొదటి నుండి చౌదరిని తప్పించేందుకే ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ విచారణకు హాజరుకాకున్నా ఎలాగో అలా చౌదరిని పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రయత్నించటం ఖాయం. ఇటువంటి పరిస్ధితుల్లో చౌదరి గనుక ఎన్ఐఏ చేతికి చిక్కితే ఇంకేమన్నా ఉందా ? ఆ భయంతోనే చంద్రబాబు తన విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రచారం ఊపందుకున్నది. మరి ఈ ప్రచారం ఎంతవరకూ నిజమో కాలమే తేల్చాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: