జగన్ కేసు ఎప్పుడైతే ఎన్ ఐ ఏ చేతిలో పడిందో కేసు అప్పటి నుంచి ఊపందుకుంది. అయితే  ఎన్ ఐ ఏ విచారణ జరిపించాల్సిన అవసరమేముందని చంద్ర బాబు మాట్లాడటం తో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే  అయితే ఇప్పుడు ఆఖరి నిమిషంలో  చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నాడు. లోకేష్ ఆధ్వర్యంలో యథారీతిన పర్యటన సాగుతుందని, బాబు వెళ్లడం లేదని వార్తలు వస్తున్నాయి.

Image result for chandrababu naidu

అంతలా గొడవపడి అనుమతి సాధించి, ఆఖర్లో బాబు ఎందుకు పర్యటనను రద్దు చేసుకున్నాడు అంటే.. రాజకీయం మీద దృష్టి సారించడానికి తెలుగుదేశం వర్గాలు సమాచారం ఇచ్చాయి. అభ్యర్థుల ఎంపిక కోసం అని చెప్పుకొచ్చాయి. అయితే.. అసలు కథ అది కాదు అనే ప్రచారం ఊపందుకుంటోంది. ఒకవైపు జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ ధర్యాప్తు ఊపందుకుంటోంది. ఇప్పటికే జగన్ పై అటాక్ చేసిన శ్రీనివాసరావును ఎన్ఐఏ విచారించింది. హర్షవర్ధన్ చౌదరిని విచారణకు పిలిపించారు. అయితే అతడు ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనను రద్దు చేసుకుని.. ఇక్కడే ఉండిపోతున్నాడని టాక్!

Image result for jagan attack

ఎన్ఐఏ విచారణను ఎలాగైనా ఆపించాలి అనేది బాబు ప్రయత్నంగా తెలుస్తోంది. ఈ విషయంలో కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయడానికి కూడా రెడీ అవుతున్నారట. ఎన్ఐఏ విచారణ మొదలైంది హై కోర్టు ఆదేశాలతోనే. అయితే ఇప్పుడు ఎన్ఐఏ విచారణపై స్టే తెచ్చుకునేందుకు తెలుగుదేశం తీవ్రంగా మల్లగుల్లాలు పడుతోందని తెలుస్తోంది.  ఎన్ఐఏ విచారణ ఈ కేసులో కొనసాగితే కొంతమంది కీలక తెలుగుదేశం నేతలకు నోటీసులు రానున్నాయని, వారు కూడా విచారణకు వెళ్లాల్సి ఉంటుందని.. అందుకే బాబు ఇప్పుడు ఈ వ్యవహారం మీద దృష్టి సారించేందుకు విదేశీ పర్యటనను సైతం రద్దు చేసుకున్నాడనే ప్రచారం ఊపందుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: