వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఓటర్లపై ఇప్పటి నుంచే వలలు విసరడం మొదలుపెట్టారు. మొన్నటికి మొన్న ఫించన్లను రెట్టింపు చేసిన ఆయన ఇప్పుడు రైతులపై తన దృష్టి సారించారు. తెలంగాణలో కేసీఆర్ తరహాలో రైతులకు పెట్టుబడి సాయం చేయాలని సంకల్పిస్తున్నారు.

Related image

తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికే ఎకరానికి ఏటా 8 వేల రూపాయలు రెండు విడతలుగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే ఏపీలో చంద్రబాబు కూడా రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారట. కాకపోతే కేసీఆర్ కేవలం భూమి సొంతదారులకు మాత్రమే ఈ సొమ్ము ఇస్తున్నారు. కానీ చంద్రబాబు కౌలుదార్లకు మేలు జరిగేలా మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Related image


ఈ పెట్టుబడి సాయం పథకాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా అమలు చేసి వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలన్నది చంద్రబాబు ఆలోచన. తెలంగాణలో ఈ ప్లాన్ కేసీఆర్ కు బాగానే ఓట్లు సంపాదించి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అసలే లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి ఈ పథకం అమలు కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ఆలోచించాల్సిన విషయమే.

Image result for jagan with farmers


మరో విషయం ఏంటంటే.. ఈ తరహా పథకాన్ని ఇప్పటికే జగన్ తన నవరత్నాలు స్కీమ్‌లో ప్రకటించి ఉన్నారు. సో.. ఒకరకంగా ఇది జగన్ నవరత్నాలను కాపీ కొట్టడమేనని చెప్పుకోవచ్చు. మరి ఈ పథకం చివరకు ఎవరికి మేలు చేకూరుస్తుంది.. ఎవరికి ఓట్లు రాలుస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: