2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ పదవీచ్యుతుడు కాక తప్పదా.. ఆయన స్థానంలో బీఎస్పీ నేత మాయావతి ప్రధాని పీఠం అధిరోహించనున్నారా.. ప్రధాని పీఠం ఎక్కిన తొలి దళిత నేతగా రికార్డు సృష్టించబోతున్నారా..అంటే అవునంటున్నాడు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్ట్ రాజ్‌దీప్‌ సర్దేశాయ్.

Image result for mayawati rajdeep

జాతీయ స్థాయిలో రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు మంచి విశ్లేషకుడిగా పేరుంది. ఆయన ఇటీవల తన వ్యాసంలో బీఎస్పీ అధినేత మాయావతి ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషించారు. ఎన్డీఏ సర్కారు ప్రభ తగ్గిపోతున్న నేపథ్యంలో.. సంకీర్ణ సర్కారు ఏర్పాటుకాక తప్పదని ఆయన విశ్లేషిస్తున్నారు.

Image result for rajdeep

ఈ సమయంలో ప్రధానిగా మోడీ కాకుండా ఎవరైనా సరే అనే పరిస్థితి విపక్షాల్లో తలెత్తుతుందని.. అప్పుడు అన్నిపార్టీలకు ఆమోదయోగ్యమైన వ్యక్తిగా మాయావతి ఉంటారని ఆయన అంచనా వేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ లో ఉప్పు-నిప్పుగా ఉండే ఎస్సీ-బీఎస్పీ చేతులు కలిపిన విషయాన్ని రాజ్‌దీప్ గుర్తు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే అఖిలేష్‌ యాదవ్‌ మాయావతిని కాబోయే ప్రధానిగా వర్ణించిన సంగతి కూడా రాజ్‌దీప్ ప్రస్తావిస్తున్నారు.

Related image


అణగారిన వర్గాల నుంచి వచ్చిన నేతగా మాయావతి ప్రధాని పీఠానికి అర్హురాలేనని రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఆమెకు కితాబిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెసేతర, భాజపాయేతర ప్రత్యామ్నాయ నాయకురాలిగా మాయావతి పరిగణనలోకి వస్తున్నారని రాజ్‌దీప్‌ చెబుతున్నారు. 1990 దశకం తొలినాళ్లలో కాన్షీరామ్ తనకు మాయావతిని చూపిస్తూ.. ఈమె ఏదో ఒక రోజు అంబేద్కర్‌ కలను సాకారం చేస్తుందని చెప్పిన విషయాన్ని రాజ్‌దీప్‌ ప్రస్తావించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: